ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది.మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జైన్‌కు జూలై 11వ తేదీ వరకు కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఈ మేరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.ఢిల్లీలో తనకు నచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చన్న ధర్మాసనం జూలై 10 లోపు ట్రీట్ మెంట్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని సూచించింది.
అదేవిధంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.