ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‎కు మధ్యంతర బెయిల్

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‎కు మధ్యంతర బెయిల్ మంజూరైంది.మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జైన్‎కు జూలై 11వ తేదీ వరకు కోర్టు బెయిల్ ఇచ్చింది.

ఈ మేరకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.ఢిల్లీలో తనకు నచ్చిన ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చన్న ధర్మాసనం జూలై 10 లోపు ట్రీట్ మెంట్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని సూచించింది.

అదేవిధంగా మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.

వావ్, రైల్లోనే జిమ్, స్పా, లగ్జరీ క్యాబిన్‌.. మేక్ ఇన్ ఇండియా సత్తా!