కర్ణాటక రాజకీయాలపై యడ్యూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు

ర్ణాటక రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

రాష్ట్రంలో 28 సీట్లను గాను 25 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది.అయితే ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకుండానే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి కుమార స్వామి కి మరో దెబ్బ పడే అవకాశం కనిపిస్తుంది.

దీనికి కారణం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు.ఇటీవల రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘానా విజయాన్ని అందుకుంది కావున ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

దీనితో అక్కడ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొంటాయో అన్న ఆసక్తి రేగుతుంది.గతంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ నేతలు మా పార్టీ లోకి మారడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పడు తాజాగా యడ్యూరప్ప వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Advertisement

అయితే ఆయన మాత్రం కాంగ్రెస్, జేడీఎస్‌‌లతో తమ ఎమ్మెల్యేలెవరూ సంప్రదింపులు జరపడంలేదని స్పష్టం చేశారు.తామంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటుపై తానేమీ చెప్పలేనని.ఏది జరిగాలో అది జరగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు