విలన్ వేషాలకు ఓకే చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌ తనయుడు.. వర్కౌట్‌ అయ్యేనా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ తన పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ ని హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే.

సొంతం సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఆర్యన్ రాజేష్ కెరియర్ ఆరంభం నుండి సక్సెస్ కోసం పాట్లు పడాల్సి వచ్చింది.

తండ్రి దర్శకత్వంలో వచ్చిన ఒకటి రెండు సినిమాలు ఆయనకు గుర్తింపుని తెచ్చిపెట్టినా ఆ తర్వాత మాత్రం పెద్దగా సక్సెస్ అవ్వలేక పోయాడు.హీరోగా సక్సెస్ కాలేక పోతున్న నేపథ్యంలో కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యాడు.

ఆ మధ్య రామ్ చరణ్ హీరో గా నటించిన వినయ విధేయ రామ సినిమా లో కీలక పాత్ర లో నటించిన విషయం తెలిసిందే.

ఇక నుండి ఆర్యన్ రాజేష్ కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.ఈ మధ్య కాలం లో సీనియర్ హీరో లు విలన్ వేషాలు వేసేందుకు ముందుకు వస్తున్నారు.అందరి దారిలోనే ఆర్యన్ రాజేష్ కూడా విలన్ వేషాలు వేసేందుకు రెడీ అయ్యాడు అంటూ సమాచారం అందుతుంది.

Advertisement

తాజాగా ఒక యంగ్ హీరో సినిమా లో ఆర్యన్ రాజేష్ విలన్ పాత్ర చేసేందుకు సైన్‌ చేశాడని.తప్పకుండా ఆయన విలన్ గా నటించి మెప్పిస్తాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

స్టార్ దర్శకుడి తనయుడు గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టినా కూడా ఆశించిన స్థాయి లో సక్సెస్ లు కాక పోవడం తో ప్రేక్షకుల నుండి గుర్తింపు లేక పోవడం తో ఇప్పుడు విలన్ వేషాలు వేసుకోవాల్సి వస్తుంది.కనీసం ఈ విలన్ గా అయిన ఆర్యన్ రాజేష్ కి సక్సెస్ లు దక్కుతాయేమో చూడాలి.

మరో వైపు ఆర్యన్ రాజేష్ సోదరుడు అల్లరి నరేష్ కూడా సక్సెస్ ల కోసం తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నాడు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు