ఐపీఎల్ 2024 సీజన్( IPL 2024 Season ) మార్చి 22వ తేదీ చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ ( Super Kings vs Royal Challengers )బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ తో అట్టహాసంగా ప్రారంభం అవ్వనుంది.చెన్నై వేదికగా ప్రారంభమయ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఐపీఎల్ 2024 సిరీస్ లో నిబంధనలలో బీసీసీఐ( BCCI ) కొన్ని మార్పులు చేర్పులు చేసింది.అవి ఏమిటో చూద్దాం.
సాధారణంగా ఐపీఎల్ లాంటి టీ20 క్రికెట్ సిరీస్ ( T20 cricket series )లు బౌలర్ల కంటే బ్యాట్స్ మెన్ లకే చాలా అనుకూలంగా ఉంటాయి.కానీ ఈ 2024 లో జరగబోయే ఐపీఎల్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది.అంటే ప్రస్తుత ఐపీఎల్ సిరీస్ లో ఒకే ఓవర్ లో ఇద్దరు బౌన్సర్లు బౌలింగ్ చేయవచ్చని బబీసీసీఐ తెలిపింది.దీంతో మ్యాచ్ చివరి ఓవర్లు వేసే బౌలర్లకు మేలు జరిగే అవకాశం చాలా ఎక్కువ.
ఇక థర్డ్ అంపైర్ బ్యాట్స్ మెన్ స్టంప్ అయ్యాడా లేదా అని నిర్ణయించేటప్పుడు, మొదటగా అతడు క్యాచ్ అయ్యాడా లేదా అనేది తనిఖీ చేస్తారు.ఇక ఐపీఎల్ 2023 సీజన్ మాదిరిగానే వైడ్, నో బాల్ లాంటివి ఈ సీజన్ లో కూడా జట్లు సమీక్షించవచ్చు.ఒక జట్టుకు ఒక ఇన్నింగ్స్ లో రెండు రివ్యూలు ఉంటాయి.ఇక ఈ నిబంధనలతో పాటు ఒక కొత్త రూల్ స్టాఫ్ క్లాక్ రూల్ ను ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ లో ఈ నిబంధనలన్నీ సమయం వృధా కాకుండా ఉండడం కోసమే అని బీసీసీఐ స్పష్టం చేసింది.