ప్రధాని మోడీ జులై 8 ( రేపు ) తెలంగాణ కు వస్తున్న సంగతి తెలిసిందే.వరంగల్ పర్యటన( Warangal tour )లో భాగంగా రూ.500 కోట్లతో కాజీపేటలో రైల్వే యూనిట్ల తయారీకి శంకుస్థాపన, అదేవిధంగా రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల నేషనల్ హైవే శంకుస్థాపన వంటి కార్యక్రమాలను మోడీ నిర్వర్తించనున్నారు.ఆ తరువాత ఆర్ట్స్ కాలేజ్ లో నిర్వహించబోయే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు.ఇప్పటికే సభకు సంబంధించి, మోడీ రాకకు సంబంధించి అన్నీ ఏర్పాట్లను పూర్తయ్యాయి.ఇక మోడీ టూర్ ప్రభుత్వ పరంగానే అయినప్పటికి రాష్ట్ర బీజేపీకి ప్లెస్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర కమలనాథులు, ఇదిలా ఉంచితే ఈసారి మూడో రాకకు సంబంధించి అందరిలోనూ సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఎందుకంటే మోడీ( Narendra Modi ) టూర్ కు ముందే తెలంగాణ బీజేపీలో చాలా మార్పులు చోటు చేసుకోవడం, అలాగే ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ బిఆర్‌ఎస్ మద్య స్నేహం చిగురించిందనే వాదనలు పెరగడం, ఎప్పుడు లేని విధంగా మోడీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సిఎం కేసిఆర్ కు ఆహ్వానం అందడం వంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
దాంతో ఈ అంశాలపై మోడీ ఎలా స్పందిస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.ముఖ్యంగా రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్(Bandi Sanjay ) ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి.
ఆ భాద్యతలు కిషన్ రెడ్డికి అప్పటించింది కేంద్రం.
ఇలా హటాత్తుగా పదవి మార్పు చేపట్టడానికి గల కారణాలను మోడీ ఏమైనా వివరిస్తారా.? నేతల మద్య విభేదాలు హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర కమలనాథులను ఉద్దేశించి ఏమైనా వ్యాఖ్యానిస్తరేమో చూడాలి.ఇంకా ఎప్పుడు తెలంగాణకు వచ్చిన కేసిఆర్ పై ఆయన పాలనపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడే ప్రధాని మోడీ ఈసారి ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరమే.
వీటన్నికికి మించి మోడీ సర్కార్ ఆహ్వానం మేరకు సిఎం కేసిఆర్ కూడా హాజరవుతారా అనేది మరింత హీటేక్కిస్తున్న అంశం.మరి మొత్తానికి మోడీ తెలంగాణ టూర్ ఈసారి పోలిటికల్ హీట్ ను రెట్టింపు చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.