వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) క్వాలిఫయర్ మ్యాచ్ లలో అగ్రశ్రేణి జట్లపై పసికూల జట్లు విరుచుకుపడ్డాయి.నెదర్లాండ్స్( Netherlands ) తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గెలిచి వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.
అగ్రశ్రేణి జట్లు జింబాబ్వే, వెస్టిండీస్ జట్లకు స్కాట్లాండ్ మట్టి కరిపించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.చివరకు స్కాట్లాండ్ ను చిత్తుగా ఓడించి ఇంటికి పంపించింది నెదర్లాండ్స్ జట్టు.
తాజాగా నెదర్లాండ్స్ జట్టు ఐదవ సారి ప్రపంచ కప్ టోర్నీకి అర్హత సాధించింది.నెదర్లాండ్స్ జట్టు ఆల్ రౌండర్ బాస్డె లీడ్ జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
బాస్డె లీడ్ 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్ లతో 123 పరుగులు చేశాడు.ఇక బౌలింగ్లో ఐదు వికెట్లు తీసి స్కాట్లాండ్ పతనాన్ని శాసించాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్( Scotland ) 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది.లక్ష్య చేదనకు దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి వన్డే వరల్డ్ కప్ అర్హత సాధించింది.క్రికెట్ అభిమానులంతా స్కాట్లాండ్ గెలిచి వన్డే వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తుంది అనుకున్నారు.
నెదర్లాండ్స్ 31 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది.అప్పటికీ లీడ్ 52 బంతుల్లో 47 పరుగులతో ఉన్నాడు.

ఆ తర్వాత లీడ్ దూకుడు పెంచి బౌండరీల వర్షం కురిపించి జట్టును గెలిపించాడు.నెట్ రన్ రేట్ ఆధారంగా నెదర్లాండ్స్ వన్డే వరల్డ్ కప్ అర్హత సాధించింది.నెదర్లాండ్స్ నెట్ రన్ రేట్ 0.160, స్కాట్లాండ్ నెట్ రన్ రేట్ 0.102, జింబాబ్వే నెట్ రన్ రేట్ -0.099 తో మూడు జట్లు 6 సమాన పాయింట్లతో నిలిచాయి.మెరుగైన నెట్ రన్ రేట్ తో నెదర్లాండ్స్ ముందంజ వేసింది.నెదర్లాండ్స్ 1996, 2003, 2007, 2011 లలో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడింది.







