బాపులపాడు మండలం వీరవల్లి జడ్పీ హైస్కూల్ లో తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కామెంట్స్ : నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.అమెరికాలో ఉంటూ సొంత ఊరిని,చదుకున్న పాఠశాలను మరిచిపోకుండా సైకిల్ షెడ్ నిర్మించిన కసుకుర్తి రాజాకు అభినందనలు.గ్రామ అభివృద్ధికి అందరూ పాటు పడాలి.
నేడు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి.సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించి సెలెక్ట్ చేసిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.
కులం,మతం తేడాలేకుండా ఏ స్థాయిలో ఉన్న వారుకైనా సమానంగా నిలబెట్టేది ఒక్క విద్య మాత్రమే.
విద్యార్థులు అందరికీ బుక్స్,బ్యాగ్ తోపాటు యూనిఫామ్,షూ ఇవ్వడం అభినందనీయం.8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు ద్వారా నాణ్యమైన విద్యను అందించాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యం.డబ్బుకన్నా విలువైంది చదువు మాత్రమే.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.ఇంగ్లీష్ మీడియం ప్రాముఖ్యత ఎంతో నాకు బాగా తెలుసు.
ఐ.ఎస్.బి కోర్సు చదువుతున్న నాకు ఇంగ్లీష్ విలువ తెలుస్తుంది.జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తా.
సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి….