ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన్న.ఇప్పుడు ఈ బ్యూటీకి బాగా కలిసి వస్తుంది.
ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.
రష్మిక ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ పట్టేసింది.
అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు ఎవరికి అందనంత లెవెల్ లో దూసుకెళ్తుంది ఈ కన్నడ బ్యూటీ.
పైగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.
దీంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.ఇక ఎంత బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వైపు అప్పుడప్పుడు తొంగి చూస్తూ అందులో బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
కెరీర్ మొదట్లో అంత గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు రష్మిక.ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ క్రష్ కావడంతో నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.
ఇక ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ వెంటనే వాటిని నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఖాళీ సమయం దొరికితే ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.

అప్పుడప్పుడు సినిమాకు బ్రేక్ దొరికితే చాలు బయట దేశాలలో తిరుగుతూ హల్చల్ చేస్తుంది.ఇక మొత్తానికి ఈ బ్యూటీ కి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా ఈ బ్యూటీని మాత్రం అసలు వదలట్లేదు దర్శకనిర్మాతలు.
ఇక ధైర్యం చూసుకునే రష్మిక రోజురోజుకి మరింత పరుగులు తీస్తుంది.ఇక తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా లో పంచుకుంది.
ఇక అందులో తను ధరించిన దుస్తులు కొంతవరకు అందాలను బయటపడకుండా చేశాయి.ఇక ఆ డ్రెస్ లో తను రకరకాల ఫోజులు ఇవ్వగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఈ బ్యూటీ సమంత స్టిల్స్ ను కాపీ కొడుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాకుండా ఓ నెటిజన్ మాత్రం ఎవరికీ చెప్పి అప్లోడ్ చేస్తున్నావే నువ్వు అంటూ ఫైర్ అయ్యాడు.ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.కానీ రష్మిక మందన ఇటువంటి కామెంట్లను, ట్రోల్స్ ను అస్సలు పట్టించుకోదు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.ఈ ఏడాది వరుసగా అవకాశాలు అందుకోగా ఇందులో తను హిందీలో నటించిన గుడ్ బై ఆ మధ్యనే విడుదలయ్యింది.కానీ ఈ సినిమాతో అంత సక్సెస్ కాలేకపోయింది.
ఈ సినిమా కాకుండా హిందీలో మిషన్ మజ్ను, యానిమల్ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే.ఇక టాలీవుడ్ లో పుష్ప 2 లో బిజీగా ఉండగా మరో సినిమాలో కూడా అవకాశం అందుకుందని తెలిసింది.







