హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Assembly elections ) ప్రచారానికి ముగింపు పలికింది ఈరోజు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువబోతున్నాయి.
ఎవరికివారు గెలుపు తమదంటే తమదే అన్న ధీమాలో ఉన్నారు.తమను, తమ పార్టీని గెలిపించాలని ఓటర్లకు అనేక రకాల విజ్ఞప్తి చేసినా, అభ్యర్థుల కొంతమంది తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించు కోలేకపోతున్నారు.
మీ ఓటు మాకే వేయాలంటూ ఓటర్లను కోరినా, తమ ఓటు తాము వేసుకునే పరిస్థితి కొంతమందికి లేకుండా పోయింది.ఈ లిస్టులో చాలామంది ప్రముఖులు ఉన్నారు.
అయితే వీరి ఓటు వేసుకోలేకపోవడానికి కారణం కుడా ఉంది.

వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వారికి ఓటు హక్కు లేకపోవడమే కారణం.బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్( CM kcr ) కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.అయితే ఆయన ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది .ఆయన అక్కడే తన ఓటును వినియోగించుకోనున్నారు.కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఓటు కొడంగల్ నియోజకవర్గం లో ఉంది .ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు.బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ లో ఉంది.

ఇక్కడ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ( Endala Lakshmi Narayana )ఓటు నిజామాబాద్ లో ఉంది.ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మదన్ మోహన్ రావు ఓటు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది.ఇంకా అనేకమంది వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల ఓట్లు వారి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోవడంతో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వారు ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
.