బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )ఏది చేసినా, అది సంచలనమే అన్నట్లుగా ఉంటుంది.ఎవరు ఊహించిన విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులు 115 మంది లిస్టును విడుదల చేశారు.
దీనిపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కెసిఆర్ ఒకేసారి ఇంతమంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం వెనక వ్యూహం ఏమిటనేది చర్చనీయాంసంగా మారింది.
అలాగే ఈ టిక్కెట్ల కేటాయింపులో సామాజిక వర్గాల సమతుల్యత పాటించలేదని , సర్వేలు, పనితీరు ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని ముందుగా చెప్పినా, ఇప్పుడు వాటిని ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువగా సీట్లు కేటాయించడంపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు( MLA ) అందరికీ టిక్కెట్లు ఇవ్వడంపై జోరుగా పార్టీలోనే చర్చ జరుగుతుంది.చాలామంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని స్వయంగా కేసీఆర్ చెప్పినా, వారికి టికెట్ కేటాయించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నగా మారింది.ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టిక్కెట్ కేటాయించడం కేసిఆర్ బలహీనతకు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు సిద్ధంగా ఉన్నా .వారిని పట్టించుకోకుండా మళ్ళీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించడంపై అసంతృప్తులు మొదలయ్యాయి.ముఖ్యంగా దళిత బంధులో 30% ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని కేసీఆర్ గతంలో చెప్పారు.
ఇప్పుడు ఆ అవినీతికి పాల్పడిన వారికి టికెట్ కేటాయించడం వెనక కారణాలు ఏమిటి ? గెలిచే అవకాశం లేకపోయినా వారికి ఎందుకు సీటు కేటాయించారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు.ఇక సామాజిక సమతుల్యత పాటించకుండా టికెట్లు కేటాయించారని , మహిళలకు కనీసం 10 సీట్లు కేటాయించకపోవడం ఏమిటని ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే టికెట్ దక్కని సీనియర్ నాయకులు చాలామంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు .బిజెపి, ( BJP party )కాంగ్రెస్ ల నుంచి వారికి ఆహ్వానాలు అందుతూ ఉండడంతో, ఆయా పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అయితే ఈ టిక్కెట్లు కేటాయింపు వెనుక కేసీఆర్ ఆలోచన వేరేగా ఉంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఆర్థికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలంగా ఉండడం, నియోజకవర్గం లో వారికున్న పరిచయాలు ఇవన్నీ కలిసి వస్తాయని , కొత్తవారిని పోటీకి దించితే వారు జనాల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించినా ఫలితం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందని కేసీఆర్ అంచనాకు రావడంతోనే, తప్పనిసరి పరిస్థితుల్లో సిట్టింగ్ లకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లుగా అర్థమవుతోంది.







