యంగ్ హీరో అడివి శేష్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ హీరో క్షణం చిత్రంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే.
ఆ తరువాత ఎవరు, గూడఛారి వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో టాలీవుడ్‌ను షేక్ చేశాడు ఈ హీరో.పూర్తగా సస్పెన్స్ జోనర్ సినిమాలను తనదైన శైలితో ఆసక్తిగా మలిచి వరుసగా విజయాలను అందుకుంటున్నాడు అడివి శేష్.
ఇక ప్రస్తుతం మేజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
అయితే సాధారణంగా అడివి శేష్ చిత్రాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేస్తుంటారు.
తాజాగా ఎవరు సినిమాను కన్నడ భాషలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ సినిమాలో అడివి శేష్ పాత్రలో దిగంత్ నటిస్తాడని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో రెజీనా పాత్ర ఎలాంటి ప్రశంసలు అందుకుందో అందరికీ తెలిసిందే.ఆమె పాత్రను కన్నడలో ఎవరు చేస్తున్నారు అనే అంశం తెలియాల్సి ఉంది.
ఎవరు చిత్రానికి పనిచేసిన చాలా మంది టెక్నీషియన్స్ ఈ సినిమాకు కూడా పనిచేస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఈ సినిమాను తెలుగులో వెంకట్ రామ్‌జీ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయగా అడివి శేష్ స్వయంగా కథను అందించాడు.
మరి కన్నడలో ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.