ఎల్లారెడ్డిపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయండి

ప్రజావాణి( Prajavani ) కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రంసాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddipeta ) మండలకేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ( Kheemya Naik )కు వినతి పత్రం అందజేశారు.

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి,గంభీరావుపేట,ముస్తాబాద్ నాలుగు మండలాలను కలుపుతూ ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని వినతి పత్రం లో పేర్కొన్నారు.

నాలుగు మండలాల ప్రజల ఆకాంక్ష,ప్రజల అభీష్టాన్ని గౌరవించి ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ గా చేయాలని ఈ మండలం వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాలకు కేంద్ర బిందువుగా ఎల్లారెడ్డిపేట మండలం అనుకూలంగా ఉంటుందని వినతి పత్రం లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్( Kheemya Naik ) తనను కలిసిన అఖిల పక్ష కమిటీ నాయకులతో మాట్లాడుతూ మీరు ఇచ్చిన వినతి నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లు తానని అన్నారు.

అడిషనల్ కలెక్టర్ ను కలిసిన వారిలో ఎల్లారెడ్డి పేట మండల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్, గంభీరావుపేట మండల అఖిల పక్ష కమిటీ కన్వీనర్ యారాపు రాజబాబు,ప్రణాళిక కమిటీ సభ్యులు మంగలి చంద్ర మౌళి, వీర్నపల్లి మండల అఖిల పక్ష కమిటీ కన్వీనర్ బట్టు పీర్యా, కో కన్వీనర్ పరుమాల మల్లేష్ యాదవ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News