పెళ్లికాని వారికే ఎంట్రీ.. జాతీయ డిఫెన్స్ అకాడమీ వెల్లడి

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవివాహిత మహిళలను నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది. UPSNDA పరీక్ష నవంబర్ 14న న జరగాల్సి ఉంది.

 Entry For Unmarried People .. National Defense Academy Revealed, Upsnda , Women-TeluguStop.com

అధికార ప్రకటన ప్రకారం.అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా యూపీఎస్ ఆన్ లైన్ లో దరఖాస్తులను తెరవడానికి యూ పీ ఎస్ సీ నిర్ణయించింది.

ఈ పరీక్షల కోసం నేషనాలిటీ, వయసు, విద్య అర్హత మొదలైన వాటిలో అర్హత ఉన్న అవివాహిత మహిళలు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది.

డబ్ల్యూపీ(సీ) లో 18/08/2021 నాటి ఉత్తర్వులు ద్వారా.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2), 2021 లో మహిళా అభ్యర్థులు పాల్గొనేందుకు సుప్రీం కోర్ట్ అఫ్ ఇండియా మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా అనుమతి ఇచ్చింది.శారీరక ప్రమాణాలు, మహిళా అభ్యర్థుల ఖాళీల వివరాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన తర్వాత తెలియజేస్తామన్నారు.

సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మహిళా అభ్యర్థుల కోసం అప్లికేషన్ విండో తెలిసి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది.ఆన్ లైన్ మోడ్ కాకుండా మరే ఇతర మోడ్ ద్వారా ఎలాంటి దరఖాస్తులు కూడా ఆమోదించబడవు.

ఈ పరీక్ష కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.మహిళా అభ్యర్థుల కోసం మొదటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షను వాయిదా వేయాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube