అభిమానులకు బ్యాడ్ న్యూస్: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మోర్గాన్‌?

అవును, ఇది నిజంగా మోర్గాన్ అభిమానులకు చేదు వార్తగానే పరిగణించాలి.అతగాడు ఎలాంటి అతగాడు అనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.

 England Cricketer Eoin Morgan Retired From International Cricket Details, Sport'-TeluguStop.com

ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన వాడుగా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ పేరిట ఓ భారీ రికార్డు వుంది.త్వరలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

ఒకప్పుడు తన ఆట తీరుతో అందరిని మెప్పించిన మోర్గాన్ ఈమధ్యకాలంలో ఫామ్‌ కోల్పోయి సతమతమవుతున్నాడు.ఈ క్రమంలో మోర్గాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింత బాధాకరమైన వార్తగానే చెప్పుకోవాలి.

ఇతని ప్లేసులో ఎవరు రాబోతున్నది ఇపుడు ప్రశ్నర్ధకంగా మారింది.మోర్గాన్‌ స్థానంలో.ప్రస్తుత వైస్‌కెప్టెన్‌గా ఉన్న జోస్‌ బట్లర్‌ ఇంగ్లిష్‌ జట్టు పరిమిత ఓవర్ల సారథిగా నియమితుడయ్యే అవకాశముందని సమాచారం.35 ఏళ్ల ఇయాన్‌.తన నాయకత్వంలో పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్‌ను తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దాడు.అయితే 2019లో జట్టు వన్డే ప్రపంచ కప్‌ గెలిచాక కెప్టెన్‌గా మోర్గాన్‌ ఒక సెంచరీ మాత్రమే చేయడం ఒకింత బాధాకర విషయమే.

ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా మూటకట్టుకున్నాడు.ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఇయాన్‌ పూర్తిగా విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌ల్లో ఖాతాకూడా తెరవలేకపోయిన అతడు గాయంతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.

Telugu Cricketereoin, Egnland Cricket, Eoin Morgan, Eoinmorgan, Jos Buttler, Lat

ఇంగ్లండ్‌ తదుపరి సారథిగా బట్లర్ ఎంపికయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.ఈసారి IPLలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.లీగ్‌లో రాజస్థాన్‌ జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక భూమిక పోషించాడు.

ఆ జోరు ను నెదర్లాండ్స్‌పై వన్డే సిరీస్ మ్యాచ్ లో కూడా కొనసాగించాడు.తొలిమ్యాచ్‌లో బట్లర్‌ అజేయంగా 162 (70 బంతులు) రన్స్‌ చేయడం విశేషత సంతరించుకుంది.

భారత్‌తో మూడేసి టీ20లు, వన్డేల హై ప్రొఫైల్‌ సిరీస్‌ కెప్టెన్‌గా బట్లర్‌కు మొదటిది కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube