ఏలూరు ఎంపీ : మహేష్ vs సునీల్ ఎవరి బలం ఎంత ? 

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు ( MLA Karumuri Nageswarao )కుమారుడు సునీల్ యాదవ్ ( Sunil Yadav )ను పోటీ చేస్తున్నారు.

ఆర్థికంగా బలంగా ఉండడం, రాజకీయంగా జిల్లా అంతటా విస్ర్తృతంగా పరిచయాలు ఉండడం, మిగతా ఏ  ఇబ్బందులు లేకపోవడంతో, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం కు సరైన అభ్యర్థిగా సునీల్ ను భావించి జగన్ ఆయనను రంగంలోకి దించారు.అలాగే ఈ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో , సునీల్ కు అవకాశం దక్కింది.

సునీల్ కు పోటీగా టిడిపి ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్( Putta Mahesh ) న రంగంలోకి దించింది.కడప జిల్లాకు చెందిన టిడిపి సీనియర్ నేత మాజీ టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్( TTD Chairman Putta Sudhakar Yadav ) కుమారుడు మహేష్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఈయన టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడ అల్లుడు.

Advertisement

సునీల్ , మహేష్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం,  ఇద్దరూ మొదటిసారి గా ఎన్నికల్లో పోటీ చేయబోతూ  ఉండడంతో ఎవరి బలం ఎంత అనేది ఆసక్తికరంగా మారింది.వైసిపి అభ్యర్థి సునీల్ యాదవ్ తండ్రి తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరావు గతంలో పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేయడంతో జిల్లాలో ఆయనకు ఉన్న పలుకుబడి సునీల్ కు కలిసి వస్తోంది.అలాగే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గల్లో వైసీపీ ఎమ్మెల్యేలు( YCP MLAs ) ఉండడం సునీల్ కు బాగా కలిసి వస్తోంది.

టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా మహేష్ యాదవ్ వ్యాపారవేత్త.ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం , రాజకీయ కుటుంబం కావడంతో ఆయనను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

అయితే ఆయన నాన్ లోకల్ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండడం, టీడీపీ నాయకుల్లోనూ దీనిపై అసంతృప్తి ఉండడం మహేష్ కు ఇబ్బందికరంగా మారింది .అయితే ఆర్థికంగా బలమైన నేతలు ఎవరు అందుబాటులో లేకపోవడంతోనే మహేష్ ను కడప నుంచి ఏలూరుకు తీసుకువచ్చారట.  ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో జనసేన,  ఒక స్థానంలో బిజెపి పోటీ చేస్తున్నాయి.

దీంతో ఒక చోట గాజు గ్లాసు , మరోచోట కమలం గుర్తుకు ఓటు వేయాలనే ప్రచారం చేస్తుండడంతో ఇది గందరగోళంగా మారుతోందట.ఏది ఏమైనా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే వార్ నడుస్తోంది.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు