ప్రమాదవశాత్తు బంగ్లా పై నుండి కింద పడ్డ యువకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రమాదవశాత్తు ఓ యువకుడు బంగ్లా పై నుండి కింద పడిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శాతాని లింగారెడ్డి కుమారుడు శాతాని చిన్ను 26 నిన్న రాత్రి ప్రమాదవశాత్తు బంగ్లా పై నుండి కింద పడిపోయాడు.

రాత్రి కావడంతో ఆ యువకుడ్ని ఎవరు గమనించలేరు.శుక్రవారం ప్రొద్దున ఆ రోడ్డు నుండి పొలాలకు వెళ్లే వ్యవసాయ రైతులు గమనించి సమాచారం కుటుంబ సభ్యులకు అందించడంతో వెంటనే క్షతగాత్రున్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

క్షతగాత్రునికి తీవ్రంగా గాయాలయి రక్తం స్రావం కావడంతో అపస్మారస్థితిలోకి వెళ్లిపోయాడని తెలిసింది.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News