ఎవరికైనా పెద్ద ఏనుగులు చూడగానే చాలా భయమేస్తుంది.అదే పిల్ల ఏనుగులను చూస్తే చాలా ముద్దు వస్తాయి.
చూడటానికి కూడా ఆ పిల్ల ఏనుగులు చాలా అందంగా కూడా ఉంటాయి.ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచ నలుమూలలకు చేరవేస్తున్నారు చాలా మంది.
ఇకపోతే మంగళవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక మంది ఏనుగులకు సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక తాజాగా భారతదేశానికి చెందిన ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా కూడా ఓ బుల్లి ఏనుగుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.ఇకపోతే ఆ వీడియోలో చిన్న ఏనుగు అరటి పండు గెలలతో ఆడుకుంటున్నట్లు మనం చూడవచ్చు.ఆ వీడియోలో ఆ బుల్లి ఏనుగు తో పాటు, తన తల్లి ఏనుగు కూడా ఉంది.మామూలుగా మన ఇంట్లో ఉండే పిల్లలు ఎంత అల్లరి చేస్తారో, అలాగే ఆ బుల్లి ఏనుగు కూడా తన అల్లరితో తెగ ఎంజాయ్ చేస్తోంది.
ఇకపోతే ఆ బుల్లి ఏనుగు పక్కనే ఉన్న అరటి గెలలను ఫుట్ బాల్ లా ఆడుతూ ఎంజాయ్ చేస్తుంది.అరటి గెలలతో ఫుట్ బాల్ లా ఆడిన తర్వాత వాటిని అక్కడ వదిలేసి మళ్ళీ తల్లి దగ్గరకు చేరుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది.
నిజానికి చిన్న ఏనుగు పిల్లను చూస్తే వాటిని ఎలాగైనా సరే పట్టుకోవాలని, వాటితో ఆడుకోవాలని ఇష్టపడతారు.ఎందుకంటే అవి చూడటానికి ఎంతో ముద్దు వచ్చేస్తాయి.సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేసిన తర్వాత అనేక మంది నెటిజన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా మన భారతదేశంలోని అనేక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులు వారివారి ప్రాంతాల్లో జరిగే జంతువుల వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలుపుతుండడంతో నిజంగా భారతదేశంలో ఇన్ని రకాల జంతువులు ఉన్నాయా అన్న అనుమానం కలగకుండా మానట్లేదు.
మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో నలుమూలల రోజు ఏ విషయం జరుగుతోందో ఇట్టే తెలిసిపోతుంది.