Cm Jagan Free Current :ఉచిత విద్యుత్తుకు ఉరి?

రైతులు,నిపుణులు,ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరి బిగించబోతుంది జగన్ ప్రభుత్వం.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్తు వినాశకర సంస్కరణల్లో భాగంగా బిగిస్తున్న మోటార్లకు మీటర్లు ఏర్పాటు పై దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు.విద్యుత్తు రంగంలో ప్రతి యూనిట్‌నూ లెక్కించాలని.ప్రతి పైసా వసూలు చెయ్యాలని,అప్పుడే సంక్షోభంలో ఉన్న విద్యుత్తు రంగం వెలుగులు విరజిమ్ముతుందని కేంద్రం రాష్ట్రాలకు బోధిస్తున్నది.వ్యవసాయం, గృహ విద్యుత్తు వినియోగదారులు విద్యుత్తు చోరీకి పాల్పడకుండా అడ్వాన్స్‌డ్‌ మీటర్లు అమర్చాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది.ఈ సూచనలను బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.కానీ పొరుగునే ఉన్న తెలంగాణ కూడా వ్యతిరేకిస్తున్నది.ఏపీ సియం జగన్మోహన్‌రెడ్డి మాత్రం కేంద్రం సూచించిన వెంటనే దాని వల్ల రానున్న రోజుల్లో వాటిల్లే అనర్థాలూఎదురయ్యే ఇబ్బందులు పట్టించుకోకుండా శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుతో విద్యుత్తు ఆదా చేశామంటూ ప్రచారం చేసుకొంటున్నారు.

 Electricity Meters For Agricultural Pumpsets ,jagan Govt ,bjp , Central Govt ,y-TeluguStop.com

ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం సకాలంలో వ్యవసాయ విద్యుత్తు బిల్లులు చెల్లించలేకపోతే రైతులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఏమిటి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు.కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందే తడవుగా, విద్యుత్తు సంస్థలు రాష్ట్రంలో వున్న 18.60 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు విద్యుత్తు మీటర్లు బిగిస్తున్నారు.ఈ పరిణామం విద్యుత్తురంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

విద్యుత్తు రంగాన్ని ప్రయివేటు కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను జగన్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుంది. రాయలసీమ,ఉత్తరాంధ్రా దక్షిణ ప్రాంతంలో రైతులు బోరు బావుల పై ఆధారపడి ఉచిత విద్యుత్తు వినియోగిస్తున్నారు.

పంపు సెట్లకు మీటర్లు పెడితే రీడింగ్ తీస్తారు.భవిష్యత్ లో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించక పొతే ఆ భారం రైతుల పై పడనుంది.

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరించాల్సిన జగన్ ప్రభుత్వం డూ,డూ బసవన్నలా తల ఊపుతూ మీటర్లు పెట్టాలని జగన్ పట్టుదలతో వ్యవహరిస్తూ రైతు ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు.అంతే కాదు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఇకనుంచే మొభైల్ ఫోన్ల మాదిరే ముందస్తుగా రీ చార్జీ చేస్తేనే విద్యుత్తు సరఫరా అయ్యే అయ్యే పరిస్థితి రానుంది.

రైతులు మీటర్ల బిగింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మోటార్లకు మీటర్లు బిగించడం పై రైతులు స్వచ్ఛందంగా మీటర్లు తీసి పారేస్తున్నారు.చెట్లకు మీటర్లను వ్రేలాడ తీస్తున్నారు.ఉచిత విద్యుత్తు అన్నప్పుడు మీటర్లు ఎందుకు అని నిలదీస్తున్నారు.మోటార్లకు మీటర్లు బిగించడాన్నిదేశంలో కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే ,జగన్ ప్రభుత్వం తాను పట్టిన పంతాన్ని వీడకుండా, రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా, వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తే జరిగే మేళ్లపై రైతులకు అవగాహన కల్పిస్తూ లేఖలు రాయాలని ఇంధన శాఖ సమీక్షా సమావేశంలో ఉన్నతాధి కారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించడం బాధ్యతా రాహిత్యం.

మోటార్లను మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్తుకు ఉరి బిగిస్తున్న జగన్ రెడ్డి మాది రైతు సంక్షేమ ప్రభుత్వంగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.మోడీ ఆదేశాలతో ఉచిత విద్యుత్తుకు వురి బిగిస్తూ మోడీ జీతగాడిగా మిగిలి పోయారు జగన్ రెడ్డి.

పార్టీ పేరు లోనే రైతు పేరు తగిలించుకున్నజగన్ రెడ్డి రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతులను మోసం చేస్తున్నవిషయం రైతులు అర్ధం చేసుకోవాలి.మోటార్లకు మీటర్లు పెట్టడం వలన రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని,మోటార్లకు వినియోగించే విద్యుత్తు కు ప్రభుత్వం పూర్తీ ఉచితంగా అందిస్తుందని,మోటార్లకు మీటర్లు బిగించడంపై రైతులకు ఎటువంటి అపోహలు అవసరం లేదని, రైతుల విద్యుత్తు బిల్లులను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని రైతులను మభ్యపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చి రైతుల మెడకు ఉరి బిగించబోతున్నది జగన్ ప్రభుత్వం.

Telugu Central, Cm Jagan, Farmers, Jagan, Pm Modi, Ysrcp-Political

వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ మీటర్ల ఏర్పాటు కోసం విద్యుత్‌ శాఖాధి కారులు నిర్వహిస్తున్న అవగాహన సదస్సు ల్లో మోటార్లకు మీటర్లంటుంటే అవి మాకు మాత్రం ఉరి తాడు గా కనిపిస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.మోటార్లకు మీటర్ల ఏర్పాటు తమకు తీవ్ర నష్టమని రైతులు వాపోతున్నారు.ప్రభుత్వం చెబుతున్న నగదు బదిలీ తాత్కాలిక మేనని, వాస్తవం కాదని, ఇప్పటికే గ్యాస్‌ సబ్సిడీ ఏమైందని ఆ అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు.తమను చావు దెబ్బతీసే విద్యుత్‌ మీటర్ల ఏర్పాటుకు తాము అంగీకరించే సమస్యే లేదని ఖరా ఖండిగా చెబుతున్నారు రైతులు .అసలు ఉచితం అన్నప్పుడు మీటర్లు ఎందుకని నిలదీస్తున్నారు.అదనపు అప్పుల కోసం కేంద్రం ఆడమన్నట్లు ఆడుతూ రైతు ప్రయోజనాలు పణంగా పెట్టడం ఏమిటి? ఉచిత విద్యుత్తు రైతుల హక్కుగా సాధించుకున్నది.వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపు చర్య వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టడమే.ఇప్పటికే సంక్షోభంలో కూరుకు పోయిన రైతులు వురి కొయ్యలకు వేలాడుతున్నారు.జీవో నెంబర్ 22 ద్వారా 18.61 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించి ఇందు కోసం రూ6,173 కోట్లు ఖర్చు చెయ్యబోతున్నారు.కేంద్ర ప్రభుత్వం కేవలం మీటర్లు మాత్రమే పెట్టాలని చూచించింది.కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి స్మార్ట్ మీటర్ల పేరుతొ భారీగా ప్రజాధనం దోపిడీకి పధకం పన్నినట్లు సమాచారం.

Telugu Central, Cm Jagan, Farmers, Jagan, Pm Modi, Ysrcp-Political

శ్రీకాకుళం జిల్లాలో అమర్చిన ఒక్కో మీటరుకు రూ 6000 నుండి 7000 మాత్రమే ఖర్చుఅయిందని డిస్కం లు చెప్పాయి.కానీ ఇప్పుడు ఒక్కో మీటర్ కు స్మార్ట్ పేరు తో రూ 35,000 ఖర్చు అవుతుందని చెప్పడం అంటే ఇది భారీ కుంభకోణం కాక మరేమిటి?ఇది ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకోవడానికి తప్ప మరొకటి కాదన్న అనుమానం కలుగుతుంది.రాబొయ్యే రోజుల్లో ఈ భారం అంతా రైతులు భరించాల్సి వస్తుంది.వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు.వ్యవసాయ విద్యుత్తు కు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెబుతున్నప్పుడు మీటర్ల బిగింపు ఎందుకు చేపట్టినట్లు? ఉచిత కరంటు అన్నప్పుడు మీటర్ల కొలత ఎందుకు? కరువుతో అల్లాడుతున్న రైతులు పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి భూగర్భ జలాలు తోడి పొయ్యడానికి కరంటు బిల్లులు భారం రైతులు మోయలేని పరిస్థితి ఏర్పడటంతో ఉచిత విద్యుత్తు పధకం పుట్టుక వచ్చింది.మళ్లి ఇప్పుడు వ్యవసాయ సంక్షోభ సమయంలో ఉచిత విద్యుత్తు కి ఎసరు పెడితే రైతుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వం ఆలోచించదా?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube