Heavy rains Tirupati : ఏపీలో ఆ రెండు జిల్లాలలో భారీ వర్షాలు..!!

గత కొద్ది రోజుల నుండి దక్షిణాది రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ముఖ్యంగా చెన్నై పట్టణంలో రికార్డు స్థాయిలో వర్షం పడుతుంది.

 Heavy Rains In Those Two Districts Of Ap , Heavy Rains, Nellore, Tirupati, Andhr-TeluguStop.com

దీంతో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక్కసారిగా వాతావరణం మార్పు చెందడంతో కురుస్తున్న వర్షాలకు జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

 మొన్నటి వరకు కోస్తా తీర ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసాయి.

తాజాగా ఈసైన్య ఋతుపవనాల ప్రభావం ఉపరితల ఆవర్తనంతో ఏపీలో నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉంది.జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాలలో పంట నష్టం కారణంగా చాలామంది రైతులు నష్టపోయారు.

సోమశిల, కండలేరు జలాశయాలకు వరద నీరు భారీగా చేరుకోవటంతో నిండుకుండలా మారాయి.అలాగే తిరుపతి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube