West Bengal Chocolate : చాక్లెట్ దొంగలించిన యువతి.. చోరీ వీడియో వైరల్ అవ్వడంతో ఆత్మహత్య..!

షాపింగ్‌మాల్‌లోకి వెళ్లినప్పుడు కుర్రకారు చాక్లెట్లను దొంగలించడం కొత్తేం కాదు.ఆడవారు కూడా ఎవరూ చూడని అప్పుడు మెల్లిగా చాక్లెట్లు తీసుకుని తమ జేబుల్లో వేసుకొని వెళ్ళిపోతుంటారు.

 A Young Woman Who Stole Chocolate Committed Suicide After The Video Of The Theft-TeluguStop.com

అయితే ఇలాంటివి చేయడం చాలా తప్పు.ఒకవేళ దొరికితే ఆ అవమాన భారం మామూలుగా ఉండదు.

లక్షలు ఇచ్చినా నలుగురిలో పోయిన పరుగు మళ్ళీ తిరిగి రాదు.కానీ కొందరు మాత్రం ఏమవుతుందిలే అని ఒక నిర్లక్ష్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు.

కాగా కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థిని ఇలాగే అనుకొని షాపింగ్‌మాల్‌లో చాక్లెట్లను దొంగిలించింది.

అయితే మాల్‌ నుంచి బయటపడదామనుకుంటున్న సమయంలోనే సెక్యూరిటీ గార్డ్స్‌కు చిక్కింది.

ఏంటమ్మా ఇది అని వారి ప్రశ్నిస్తే సారీ చెప్పేసి, డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.అయితే ఆమె చాక్లెట్లు దొంగలిస్తున్నప్పుడు, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కి అడ్డంగా దొరికినప్పుడు, సారీ చెబుతున్నప్పుడు మాల్‌ సిబ్బంది వీడియోలు, ఫొటోలు తీశారు.

వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్‌ అయ్యాయి.సోషల్ మీడియాలో ఇలా తన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయని ఆ అమ్మాయి తెలుసుకుంది.

కాలేజీలో కూడా ఈ విషయం అందరికీ తెలిసింది.దాంతో ఆ విద్యార్థిని అవమాన భారం తట్టుకోలేక ఈ ఆదివారం నాడు సూసైడ్ చేసుకుంది.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగింది.

అయితే నేరాన్ని ఒప్పుకుని, డబ్బులు ఇచ్చాక కూడా అనవసరంగా తన కూతురి ఫొటోలు, వీడియోలు తీసి పరువు తీశారని తల్లిదండ్రులు షాపింగ్ మాల్ సిబ్బందితో గొడవపడ్డారు.

కొందరు జనాలు షాపింగ్ మాల్ ముందు, జైగావ్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు.దీనికి బాధ్యులైన వారిపై కేసులు పెట్టాలని పోలీసుల వద్ద డిమాండ్ చేశారు.

దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు జైగావ్ పోలీసు అధికారి ప్రబీర్ దత్తా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube