నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఈ ఘటనను అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ సీరియస్ గా తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి.దీనిలో భాగంగానే నల్గోండ ఎస్పీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా, కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కంప్లెయింట్ ఇచ్చింది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపునిచ్చింది.







