Mudragad Padmanabham ycp : పవన్ పై వైసీపీ 'ముద్రగడ ' అస్త్రం ? 

ఏపీలో కుల రాజకీయం మొదలయిపోయింది.ఎన్నికల సమయం ముంచుకు వచ్చేస్తున్న క్రమంలో ఏపీలో ప్రధాన సామాజిక వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Ycp Try Ty To Join The Mudragada Padmanabham, Pavan Kalyan, Telugudesam, Ysrcp-TeluguStop.com

ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మెజార్టీ కాపులు ఈ సారి జనసేన కు అండగా నిలబడతారు అనే సంకేతాలు ఏపీ అధికార పార్టీ వైసీపీకి కలవరం పుట్టిస్తున్నాయి.

ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గం ను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

     మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు వైసిపి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ముద్రగడ వైసీపీ కండువా కప్పుకుంటే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు వైసిపి సిద్ధంగా ఉంది.అలాగే కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పోటీ చేసేందుకు సముకత వ్యక్తం చేస్తే ఆ సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఒకవేళ ముద్ర రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటే ఆయన కుమారుడుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గ నుంచైనా టికెట్ ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలను పంపించింది.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ పై పోరాటాన్ని లేవనెత్తారు ఆ సమయంలో టిడిపి ప్రభుత్వం ముద్రగడ తో పాటు ఆయన కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేయడం,  కాపులంతా ఏకతాటిపైకి వచ్చి టిడిపికి వ్యతిరేకంగా పనిచేయడం తదితర పరిణామాలు 2019 ఎన్నికల్లో టిడిపి కి కాపు సామాజిక వర్గం దూరమైంది .
   

Telugu Ap, Kapi, Pavan Kalyan, Telugudesam, Ysrcp-Political

    అయితే ఇప్పుడు జనసేన ద్వారా, మళ్లీ టిడిపి , జనసేన కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ముద్రగడను వైసిపి దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.కాపుల్లో పవన్ పై కంటే.ముద్రగడ పైనే ఎక్కువ అభిమానం ఉందనే లెక్కల్లో వైసీపీ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube