ఎలక్ట్రిక్ స్కూటరిస్ట్ అరుదైన రికార్డ్... కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసేసాడు?

కరోనా పుణ్యమాని జనాలు డీసెల్, పెట్రోల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారు.ఓ రకంగా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వాహనాల శకం ఆరంభమయ్యిందనే చెప్పుకోవచ్చు.

 Electric Scooterist S Rare Record Journey From Kanyakumari To Kashmir ,electric-TeluguStop.com

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో చాలా మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసినదే.ఈ క్రమంలో కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలతో సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి బౌన్స్ కంపెనీ యొక్క ‘ఇన్ఫినిటీ ఈ1 ఈ-స్కూటర్‌’ తో ప్రపంచంలో ఎత్తైన రహదారులలో ఒకటైన ఖర్దుంగ్-లాగా చేరుకున్నాడు.

వివరాల్లోకి వెళితే, మంగళూరు ప్రాంతానికి చెందిన మోటార్‌సైకిలిస్ట్ మరియు వీడియో వ్లాగర్ ‘గిరీష్’ బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ తో K2K చేరుకోవాలని అనుకున్నాడు.

అంటే ‘కన్యాకుమారి నుంచి కాశ్మీర్’ వరకు అని అర్థం అన్నమాట.తన ప్రయాణాన్ని భారతదేశానికి దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి ప్రారంభించి ఉత్తరాన ఉన్న కాశ్మీర్ చేరుకుని ఒక అరుదైన రికార్డ్ సృష్టించాడు.

గిరీష్ తన లాంగ్ రైడింగ్ కి బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంచుకున్నాడు.బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉంటుంది. గిరీష్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ‘రూబీ’ అని పేరు పెట్టాడు.

Telugu Kanyakumari, Kashmir, Rare-Latest News - Telugu

మొత్తం తన రైడ్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేరుకోవడానికి అతగాడికి కేవలం 19 రోజులు సమయం మాత్రమే పట్టింది.ఇందులో ఎన్నో అద్భుతమైన అనుభవాలను ఎదుర్కొన్నాడు.తన లాంగ్ రైడింగ్ లో కేవలం రైడింగ్ మరియు ఛార్జింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడమే కాకూండా.

వాతావరణ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.అద్భుతమైన హ్యాండ్లింగ్, సస్పెన్షన్ మరియు రైడ్ రైడింగ్ పొజిషన్ వంటి వాటికి బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకూలంగా ఉంది, కావున దీనిని ఎంచుకోవడం జరిగిందని గిరీష్ తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube