జమిలి ఎన్నికలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో ముందస్తు ఎన్నికలు రావడం లేదా ఆలస్యం కావడం జరగదని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పదవీకాలం చివరి రోజు వరకు దేశానికి సేవలు అందిస్తారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.అదేవిధంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని తెలిపారని సమాచారం.
సార్వత్రిక ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ఆలస్యం చేయాలని బీజేపీ సర్కార్ అనుకోవడం లేదని వెల్లడించారు.కాగా ఇటీవలే ఒకే దేశం – ఒకే ఎన్నిక అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.







