ప్రముఖ టాలీవుడ్ నటి మాధవీలత( Tollywood Actress Madhavi Latha ) గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించి మాధవీలత పాపులారిటీని పెంచుకున్నారు.
చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టిన మాధవీలత నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారారు.తొలి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో మాధవీలతకు ఆ తర్వాత స్నేహితుడా, ఉసురు, అరవింద్2, అంబాలా, చూడాలని చెప్పాలని, తొలిపాట సినిమాలలో నటించారు.

అయితే నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు( Pawan Kalyan Birthday ) అనే సంగతి తెలిసిందే.పవన్ పుట్టినరోజు సందర్భంగా మాధవీలత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.అయితే మాధవీలత తన పోస్ట్ లో పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా పవన్ కళ్యాణ్ గారు అని ప్రస్తావించకపోవడం పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం కలిగించడంతో పాటు కోపం తెప్పించింది.
పవన్ ఫ్యాన్స్( Pawan Fans ) తనను ట్రోల్ చేయడంతో మాధవీలత కూడా రివర్స్ లో అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.
తనపై వచ్చిన ట్రోల్స్ గురించి మాధవీలత స్పందిస్తూ “ఎవడమ్మ జీవితం.బర్త్ డే విషెస్ చెబితే కూడా పెంట చేస్తుండ్రు సామీ.మీ బ్రతుకులు గారు లేదంట సామి.ఐతే మిస్టర్ కూడా తీసేస్తా.
అమ్మగారు నాన్నగారు మొగుడుగారు బాయ్ ఫ్రెండ్స్ గారు అనను.అలాగే ఫ్రెండ్స్ గారు అంటారేమో అనను” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

మన మనస్సుకు నచ్చితే సింగిలే అంటూ మాధవీలత కామెంట్ చేశారు.డైరెక్ట్ గా కలిస్తే అండి గారు అంటాం కానీ పబ్లిక్ మీడియా విషెస్ లో గారు అని ఎందుకంటామని ఆమె చెబుతున్నారు.మాధవీలత చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మాధవీలత వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.







