చాలామందికి బిగ్ బాస్( Bigg Boss ) అనేది ఒక కల అదే బిగ్ బాస్ కొంతమందికి పీడకలగా కూడా మారుతుంది.ఏది ఏమైనా ఎలాంటి అవకాశం వచ్చినా మనం దానిని ఎలా వాడుకుంటున్నాము అనే దాని పైననే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అంటారు కొంతమంది సెలబ్రిటీలు.
బిగ్ బాస్ సెవెన్( Bigg Boss 7 ) మొదటి రోజు షూటింగ్ అట్టహాసంగా పూర్తి చేసుకుని లైఫ్ టెలికాస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇక బిగ్ బాస్ ఏడవ సీజన్ నుంచి కొంతమంది చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చిందట కారణాలు ఏమైతే నేమి కానీ బంగారం లాంటి అవకాశం అయితే మిస్ చేసుకున్నారు ఇంతకీ బిగ్ బాస్ సెవెన్ లో జాయిన్ అవ్వకుండా త్రుటిలో బయటకు వచ్చిన సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం.

సీరియల్ నటి అంజలి పవన్( Anjali Pavan ) రెమ్యునరేషన్ విషయంలో పేర్చి రావడంతో చివరి నిమిషంలో సెవెన్ సీజన్లోకి అడుగుపెట్టలేకుండా పోయిందట.ఇక యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినటువంటి అనిల్( Anil ) సైతం బిగ్బాస్ సీజన్ కి రావాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో అతడికి యాజమాన్యం హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది తనకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయినందుకు అనిల్ చాలా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక జబర్దస్త్ కమెడియన్ నరేష్( Jabardasth Naresh ) సైతం ఈ సీజన్లో పాల్గొనాల్సి ఉండగా ఈటీవీ వారితో ఉన్న కాంట్రాక్ట్ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టలేకపోతున్నాడు.
మరోవైపు అమెరికా నుంచి ఒక షో కూడా ఉండడంతో బిగ్ బాస్ కి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

సీరియల్ నటి పూజ మూర్తి( Puja Murthy ) సైతం బిగ్బాస్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక మరొక యూట్యూబ్లోకి అడుగుపెట్టడానికి చివరి నిమిషంలో అవకాశం చేజారినట్టుగా చెప్పాడు.మొగలిరేకులు ఫేమ్ సాగర్( Sagar ) సైతం బిగ్బాస్ సీజన్ నుంచి ఈ చివరి నిమిషంలోనే తప్పుకున్నాడు.
అలాగే మహేష్ ఆచంట( Mahesh Achanta ) సైతం దాదాపు ఎంట్రీ ఖాయం అనుకున్న సమయంలో షోలో పాల్గొనడానికి నో చెప్పాడట.ఇలా కొంతమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ షో నుంచి చివరి నిమిషంలో తప్పుకున్నారు ఏది ఏమైనా 50 లక్షలు గెలిచే అవకాశాన్ని కూడా కోల్పోయారు.







