యాదాద్రి భువనగిరి జిల్లా:పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో వీడియో సర్వైలెన్స్ టీములు క్షేత్రస్థాయిలో తీసిన వీడియోలను వీడియో వీవింగ్ టీములు క్షుణ్ణంగా పరిశీలించి అకౌంటింగ్ టీములకు పంపాలని, అకౌంటింగ్ టీములు వాటి వివరాల ప్రకారం రేట్ కార్డు ధరలతో వ్యయాన్ని నమోదు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంత్ కే.జండగే( Collector Hanumantu K.
Jendage ) అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో భువనగిరి పార్లమెంట్ పరిథిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల అసిస్టెంట్ ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్స్,అకౌంటింగ్ టీముల సభ్యుల అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ…ఐటి,జీఎస్టి,బ్యాంకింగ్,ఎంసిఎంసి,ఎక్సైజ్ తదితర రిపోర్టులను క్షుణంగా పరిశీలించి వ్యయాలను నమోదు చేయాలని సూచించారు.
ఎన్నికల పరిశీలనకు వచ్చే ఎక్స్పెండేచర్ అబ్దర్వర్లకు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్ షాలోమ్,భువనగిరి ఆర్డీఓ అమరేందర్,జిల్లా ఎక్స్పెండీచర్ నోడల్ అధికారి,జిల్లా పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ ఎక్స్పెండేచర్ అబ్జర్వర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.