చిత్రం : ఎక్కడికి పోతావు చిన్నవాడబ్యానర్ : మేఘనా ఆర్ట్స్దర్శకత్వం : వి.ఐ.ఆనంద్నిర్మాత : పి.వి.రావుసంగీతం : శేఖర్ చంద్రవిడుదల తేది : నవంబర్ 18, 2016నటీనటులు : నిఖిల్, హెబా పటేల్, నందిత శ్వేత, వెన్నెల కిషోర్, ఆవికా గోర్ (అతిథి పాత్ర)
కొత్తరకం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు నిఖిల్ చాలామంది యువకథానాయకులకి భిన్నంగా, మాస్ ఉచ్చులో పడకుండా, పూర్తిగా లవర్ బాయ్ చట్రంలో చిక్కుకోకుండా ప్రయోగాలు చేస్తున్నాడు.అలాంటి మరో ప్రయోగమే ఎక్కడికి పోతావు చిన్నవాడ.
ఇక ఈ ప్రయోగం ఫలించిందో లేదో చూద్దాం.
కథలోకి వెళ్తే …
అర్జున్ (నిఖిల్), కాలేజీ రోజుల్లోనే ఆయేషా అనే ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.
కాని సరిగ్గా పెళ్ళి సమయానికి ఆ అమ్మాయి అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే నాలుగేళ్ళ తరువాత తన స్నేహితుడు కొషోర్ (వెన్నెల కిషోర్) ఓ మానసిక సమస్యతో బాధపడుతుంటాడు.
తనలో ఉన్నది దెయ్యమని, అర్జున్ తో కలిసి కేరళలోని ఓ ఆలయానికి సహాయం కోసం వెళ్తాడు కిషోర్.అక్కడ అర్జున్ కి పరిచయం అవుతుంది అమల/నిత్య (హెబా పటేల్).
ఆ ప్రేమకథ సఫలమయ్యేలోపే ఆ అమ్మాయి కూడా అడ్రెస్ లేకుండా వెళ్ళిపోతుందికొన్ని సంఘటనల తరువాత అర్జున్ కి అర్థమయ్యే విషయం ఏమింటంటే, తనని ప్రేమించింది తనకి కేరళలో పరిచయమైన అమ్మాయి కాదు, తనలోకి ప్రవేశించిన ఆత్మ అని.అక్కడినుంచి అర్జున్ జీవితం చాలా మలుపులు తిరుగుతుంది.తన జీవితంలోకి మరో అమ్మాయి (నందిత శ్వేత) వస్తుంది.ఇంతకి అమల ఎవరు? ఆయేషా ఎవరు? కొత్తగా అర్జున్ జీవితంలోకి వచ్చిన అమ్మాయి ఎవరు? అర్జున్ ని ప్రేమించిన ఆత్మ ఎవరిది? అసలు అర్జున్ ఎవరిని ప్రేమించాడు.ఈ సమాధానాలన్ని థియేటర్లో చూడండి.
నటీనటుల నటన గురించి
నిఖిల్ చాలాబాగా చేసాడు.
ఫస్టాఫ్ లో అమ్మాయి దూరం అవగానే, నిఖిల్ ముఖంలోని బాధ మనల్ని కూడా బాధకి గురిచేస్తుంది.అలాగే తన ప్రేయసి కోసం సినిమా చివర్లో నిఖిల్ వేదన కూడా బాగా పండింది.
నిఖిల్ కి ఇటు నటనపరంగా, అటు స్క్రిప్టు సెలెక్షన్ పరంగా మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా
నందిత పాత్ర ఈ సినిమాకి ఆయువుపట్టు.నిజానికి హీరో కన్నా ఎక్కువ మార్కులు కొట్టేసింది నందిత.
సెకండాఫ్ కి అంతా తానై నడిపించింది.హెబా పటేల్ నటన కుమారి 21ఎఫ్ లో ఉన్నట్లుగానే అనిపించింది.
అభినయం పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేకున్నా, దొరికిన ఒకటి అర సన్నివేశాల్లో హెబా గ్లామర్ సినిమాకి చిన్న ప్లస్ పాయింట్
వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాడు, అక్కడక్కడ తేలిపోతాడు.గెస్ట్ రోల్ లో అవికా గోర్ మెరిసింది.
మిగితా పాత్రధారులు ఓకే.
సాంకేతికవర్గం పనితీరు
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అల్బమ్ లో రెండు పాటలు బాగా ఇచ్చాడు.ఇక నేపథ్య సంగీతం చాలా బాగా ఇచ్చాడు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఖచ్చితంగా సినిమాని నిలబెట్టింది.ఎడిటింగ్ ఫస్టాఫ్ లో చాలావరకు తేలిపోయింది.అలాగే సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగున్నా, ఎడిటర్ తన చాతుర్యంతో ఇంకేదైనా ఆలోచిస్తే బాగుండు అనిపిస్తుంది.
అలాగే కొన్ని అనవసరపు సన్నివేశాలకి కత్తెర వేయలేదు.నిర్మాణ విలువలు ఇంకా బాగుండాల్సంది.
సినిమాటోగ్రాఫి కూడా అంతే.
విశ్లేషణ
ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది.
దాన్ని సినిమాగా మలచడం అంటే, తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా మలచాలి.అందుకే సేఫ్ సైడ్ కోసం దర్శకుడు అక్కరలేని కామెడి జతచేయడానికి ప్రయత్నించాడు.
ఆసక్తికరమైన కథలో అవే స్పిడ్ బ్రేకర్లుగా మారతుంటాయి.ముఖ్యంగా వెన్నెల కిషోర్ ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు ఆనంద్.
కాని ఇంటర్వెల్ కి ఓ పదిపదిహేను నిమిషాల ముందు ఊపందుకున్న సినిమా, ఆ తరువాత మంచి పేస్ తో వెళ్ళిపోతుంది.క్లయిమాక్స్ అందరికి నచ్చకపోవచ్చు.
సూపర్ నేచురల్ లవ్ స్టోరీ కాబట్టి అంచనాలకు తగ్గటుగా ఉండదు క్లయిమాక్స్.అలాగే సెకండాఫ్ లో నవ్వు తెప్పించిన కొన్ని సన్నివేశాలు కూడా రోటీన్ గా అనిపించవచ్చు.
మొత్తం మీద, నిఖిల్ చేసిన మరో ప్రయోగం ఫలించింది.సినిమా హిట్.
హైలైట్స్ : * కథ* నందిత* సెకండాఫ్ * నేపథ్య సంగీతం
డ్రాబ్యాక్స్ : * ఎడిటింగ్* ఫస్టాఫ్ లో పేలని కామెడి* కొన్ని అనవసరపు సన్నివేశాలు * మీడియం నిర్మాణ విలువలు.
చివరగా :
థియేటర్ కి వెళ్ళి చూడు చిన్నవాడ.సినిమా బాగుంది.