ఈ డౌటు ఇప్పుడు అందరినీ వేధిస్తోంది! నిజానికి ఎంతో సౌమ్యంగా తనపని తాను చేసుకుపోయే నెల్లూరుకు చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల కాలంలో భజన మంత్రిగా మారాడని విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి.తమకు అనుకూలంగా ఉన్న వాళ్లను పొగడడం రాజకీయాల్లో కొత్తకాదు.
వింత అంతకన్నా కాదు.అయితే, ఈ పొగడ్తలకు కూడా కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి.
కానీ, వెంకయ్య ఈహద్దులు, పరిమితులు దాటేస్తున్నారని ప్రతి ఒక్కరూ చెప్పుకొంటున్నారు.ఇటు ఏపీకి వచ్చినా.
అటు ఢిల్లీకి వెళ్లినా.వెంకయ్య ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారట.
అది ఎవరి మీద? ఎందుకు? అనేగా ప్రశ్న.అయితే ఇది చదవాల్సిందే.
2014 ఎన్నికల సమయంలో ఏపీలో టీడీపీతో జతకట్టిన బీజేపీ రాష్ట్రంలో మంచి పొజిషన్‌లోకే వచ్చింది.రెండు మంత్రి పదవులు కూడా పొందింది.
ఈ క్రమంలోనే కేంద్రంలో ఇద్దరు టీడీపీ ఎంపీలకు మంత్రి పదవులు కట్టబెట్టింది.ఇది ఇచ్చి పుచ్చుకోవడంలో భాగం.
అయితే, వెంకయ్య మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబును వీలు చిక్కినప్పుడల్లా.పొగిడేస్తున్నారు.
అక్కడ మోడీ.ఇక్కడ చంద్రబాబు.
అంటూ స్టార్ట్ చేసే ఈ పొగడ్తల జల్లు ఆఖరికి దేవుళ్లు, రాముళ్లు.అనే రేంజ్‌కి ఎగబాకేస్తోంది.
బాబు లేకుండా ఏపీయే లేదనే రేంజ్‌లో మొన్నటికి మొన్న ఆయన చేసిన కామెంట్లపై నెటిజన్లు పెద్ద స్థాయిలోనే విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు నోట్లరద్దుపై అటు విపక్షాలు, సామాన్యుల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనూ మోడీని పొగడడం ఆపడం లేదు వెంకయ్య.నోట్ల రద్దు చర్యతో మోడీ ప్రపంచ నాయకుడై పోయారని అన్నారు.
గతంలో అద్వానీ శిబిరానికి చెందిన వెంకయ్య ఆయనను అభినవ సర్దార్ అంటుండే వారు.ఈ మధ్యనే ఆ టైటిల్ మోడీకి మార్చేశారు.
వాజ్‌పేయి హయాంలో ఆయనను వికాస్ పురుష్ అనీ అద్వానీని లక్ వికాస్ పురుష్ అని (ఇదే సర్దార్ టైటిల్) పొగిడితే అటల్జీ అలిగి వెళ్లిపోయారు.మరి ఈ పొగడ్తల వర్షం.
భజన.ఇంకెన్నాళ్లు నడుస్తుందో తెలీదు!!
.