మీ టూవీలర్‌ మైలేజ్‌ 10 నుండి 15 శాతం పెంచే 8 అద్బుతమైన చిట్కాలు.. ప్రయత్నిస్తే మీరే ఒప్పుకుంటారు

ఇతర దేశాల సంగతేమో కాని ఇండియాలో పెట్రోలు రేటు విపరీతంగా పెరిగి పోయింది.త్వరలోనే వంద రూపాయలకు పెట్రోలు రేటు పెరుగుతుందేమో అంటూ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

 Eight Easy Tips To Increase Mileage From Your Bike-TeluguStop.com

గత పది సంవత్సరాల్లో దాదాపుగా 300 రెట్లు పెట్రోలు రేట్లు పెరిగిన తీరు చూస్తుంటే భయాందోళన కలుగుతుంది.మరో పది సంవత్సరాల్లో 200 రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇంత భారీగా రేట్లు పెరుగుతున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బండిని వాడాల్సిందే, బండిలో వందలకు వందలు పెట్టి పెట్రోలు పోయించాల్సిందే.100, 200 రూపాయలే కాదు 500 రూపాయలు అయినా కూడా పెట్రోలు బంకుల వద్ద సీజన్‌ అలాగే ఉంటుంది.మన అవసరం కనుక తప్పనిసరిగా వాడాల్సిందే.అయితే రేటు ఎలాగూ మన చేతిలో లేదు, కనీసం పెట్రోలు వాడకం అయినా తగ్గించుకుంటే బెటర్‌.పెట్రోల్‌ వాడకం తగ్గించడం కష్టమే కాని, బండి మైలేజ్‌ పెంచుకోవడం కష్టం కాదు.అవసరాలకు తగ్గట్లుగా బండిని తీసుకుని, ఆ బండిని కండీషన్‌లో ఉంచుకోవడం వల్ల పెట్రోలు రేట్ల నుండి కొంతలో కొంత అయినా ఉపశమనం పొందవచ్చు.

బండి మైలేజ్‌ పెంచుకునేందుకు ఇంజనీర్‌లు, సీనియర్‌ మెకానిక్‌ లు సూచిస్తున్న 8 చిట్కాలు మీకోసం.
1.బండి సర్వీసింగ్‌ను ఎప్పటికప్పుడు చేయిస్తూ ఉండాలి.సర్వీసింగ్‌ విషయంలో అశ్రద్ద వల్ల మైలేజ్‌ తగ్గుతుంది.
2.ఇంజన్‌ బాగుండాలంటే మంచి ఇంజనాయిల్‌ వాడాలి.మార్కెట్‌ లో ఉన్న మంచి బ్రాండ్‌ను మాత్రమే వాడమని మెకానిక్‌కు చెప్పాలి.పది ఇరవై రూపాయల కక్కుర్తితో లోకల్‌ బ్రాండ్‌ను వాడొద్దు.

3.బండి నడిపే సమయంలో పదే పదే రేజ్‌ పెంచుతూ తగ్గిస్తూ ఉండకుండా, ఒక లెవల్‌లో వెళ్లాలి.
4.లాంగ్‌ డ్రైవ్‌లో వెళ్లే సమయంలో ఒకే స్పీడ్‌ను మెయింటెన్‌ చేయడం వల్ల మంచి మైలేజ్‌ వస్తుంది.అంటే సీసీని బట్టి బండి లిమిట్‌ అంటూ ఉంటుంది.ఆ స్థాయిలో వెళ్తే మంచి మైలేజ్‌ ఖాయం.

5.బండిపై మోతాదుకు మించి వెయిట్‌ వెయ్యడం అస్సలు కరెక్ట్‌ కాదు.

అంటే 150 సిసి బండి పై కింటాకు పైగా వేయడం వల్ల ఆ బండిపై అధిక భారం వేయడం అన్నట్లే.అలా జరిగితే మైలేజ్‌ తక్కువ అవుతుంది.
6.ఇక బండి రెండు టైర్లలో కూడా గాలి ఎప్పుడు కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి.గాలి తక్కువ ఉండటం వల్ల మైలేజ్‌ చాలా తక్కువ వస్తుంది.

7.ట్రాఫిక్‌లో వెళ్లే సమయంలో హడావుడిగా వెళ్లాలనే ఉద్దేశ్యంతో ప్రయత్నించినా కూడా మైలేజ్‌ తక్కువ వస్తుంది.ట్రాఫిక్‌ లో హడావుడి లేకుండా సిగ్నల్‌ పడ్డప్పుడు ఇంజన్‌ ఆపేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.
8.పదే పదే క్లచ్‌ను వాడకుండా ఉండటం మంచిది.బండిని ఎక్కువగా మంచి రోడ్డులోనే ప్రయాణించేలా దారిని ఎంపిక చేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube