వారం రోజుల్లో ముఖాన్ని తెల్ల‌గా మార్చే సూప‌ర్ హోమ్‌ రెమెడీ ఇదే!

సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం మొత్తం తెల్ల‌గా ఉన్నా.ముఖం మాత్రం కాస్త రంగు త‌క్కువ‌గా ఉంటుంది.

ఎండ‌ల ప్ర‌భావం, కాలుష్యం, దుమ్ము, ధూళి, మృత క‌ణాలు పేరుకుపోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, ఆహార‌పు అల‌వాట్లు వంటి కార‌ణాల వ‌ల్ల ముఖ చ‌ర్మం డార్క్‌గా మారుతుంటుంది.దాంతో ముఖాన్ని తెల్ల‌గా మార్చుకోవాల‌నే తాప‌త్రాయంతో మార్కెట్‌లో దొరికే స్కిన్ వైట్ నింగ్ క్రీముల‌ను వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, చాలా మందికి అటువంటి క్రీముల వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నాలూ ద‌క్క‌వు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ప్ర‌య‌త్నిస్తే కేవ‌లం ఏడు రోజుల్లోనే మీ స్కిన్ టోన్‌ ఇంప్రూవ్ అవ్వ‌డాన్ని గ‌మ‌నిస్తారు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హోమ్ రెమెడీ ఏంటీ.?ఎలా త‌యారు చేసుకోవాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక క‌ప్పు గులాబీ పువ్వు రేఖ‌లు, ఒక క‌ప్పు తుల‌సి ఆకులు, ఒక క‌ప్పు పుదీనా ఆకులు తీసుకుని నీడ‌లో బాగా ఎండ బెట్టుకోవాలి.

Advertisement

ఎండిన‌ త‌ర్వాత ఈ మూడింటినీ క‌లిపి మెత్త‌టి పొడిలా చేసుకుని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో త‌యారు చేసుకున్న పొడి రెండు టేబుల్ స్పూన్లు, ఆవు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో వాష్ చేసుకుని.ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకోవాలి.ప‌ది లేదా ప‌దిహేను నిమిషాల పాటు ఆరిన త‌ర్వాత కొద్దిగా వాట‌ర్ చ‌ల్లి వేళ్ల‌తో స్మూత్‌గా రుద్దుకుంటూ కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే గ‌నుక వారం రోజుల్లోనే ముఖం వైట్‌గా బ్రైట్‌గా మారుతుంది.మురియు స్మూత్ అండ్ సాఫ్ట్ చ‌ర్మాన్ని కూడా పొందొచ్చు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు