పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల..!! 

అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అదే విధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్.

తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తనని టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అనేక ఇబ్బందుల పాలు చేయడం జరిగిందని, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయటం కుట్ర అని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి పదవి నుండి తొలగించటం జరిగిందని పేర్కొన్నారు.

కనీసం వివరణ ఇవ్వలేదు ఎవరో అనామకుడు లెటర్ రాస్తే దానిని పరిగణలోకి తీసుకుని ఇష్టానుసారం అయిన చర్యలు తీసుకున్నారని టిఆర్ఎస్ పార్టీపై ఈటెల మండిపడ్డారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎవరు ఎన్ని మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీని బలపరిచింది మాత్రం తానే అని పేర్కొన్నారు.

అటువంటి నియోజకవర్గంలో ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు తనతో కలసి పని చేసిన నాయకులకు డబ్బులు ఆశలు చూపి ప్రజాప్రతినిధులను భయాందోళనకు గురి చేశారు అని తెలిపారు.అయితే ఇన్ని కుట్రలు తనపై జరుగుతున్న తనకి నియోజకవర్గ ప్రజల అండ ఉందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు రాజీనామా చేయడం జరిగిందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్ కాదు బానిస భవన్ సీఎంవో లో ఎస్సీ, ఎస్టీ, బిసి ఐఏఎస్ అధికారి ఎవరైనా ఉన్నార అదే దీనికి నిదర్శనం అంటూ ఈటల విమర్శల వర్షం కురిపించా.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు