తెలుగు పాపకు బంపర్ ఆఫర్.. అక్కడ ఏం జరుగుతుందో?

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను సంపాధించుకుంది.

ఈ బ్యూటీ చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా అమ్మడి యాక్టింగ్‌కు మంచి గుర్తింపు లభించింది.

కాగా బ్యూటీకి సరైన పాత్రలు దక్కలేదనే మాట మాత్రం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈషాకు హీరోయిన్ ఆఫర్లు చాలా తక్కువే ఉన్నా, సెకండ్ హీరోయిన్‌గా మాత్రం ఆఫర్లు వస్తున్నాయి.

కాగా తాజాగా ఈషా రెబ్బాకు బాలీవుడ్‌లో ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.బాలీవుడ్ స్టార్ బ్యూటీ సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ నటించబోయే తాజా చిత్రంలో హీరోయిన్‌‌గా ఈషా రెబ్బాకు ఆఫర్ లభించింది.

ఈ సినిమాను రాజ్ సింగ్ చౌదరి డైరెక్ట్ చేయనున్నాడు.ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన పాగా వేయాలంటూ ఈషా రెబ్బా ప్రయత్నిస్తోంది.

Advertisement

ఈ సినిమా ఎలాగైనా సక్సెస్ కావాలని అమ్మడు కోరుకుంటోంది.ఈ సినిమా ఆడిషన్స్‌లో ఈషా రెబ్బా పర్ఫార్మెన్స్‌కు దర్శకనిర్మాతలు ఫిదా కావడంతో ఆమెను వెంటనే ఓకే చేశారట.

ఇక ఈ సినిమాలో ఈషా ఓ రాజస్థానీ అమ్మాయిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి ఈ సినిమా ఆఫర్‌తో ఈషా పాప ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో ఈషా బాలీవుడ్‌లో పాగా వేస్తుందో లేదో చూడాలి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు