ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ఈడీ కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో( ED Custody ) ఉండనున్నారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కేజ్రీవాల్ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో ఆయనను మరో వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.