రాజగోపాల్‌ రెడ్డికి ఈసీ షాక్‌

మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.

 Ec Shock For Rajagopal Reddy-TeluguStop.com

టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.రాజగోపాల్‌రెడ్డి, ఆయ న కుటుంబీకులకు చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి జరిగిన రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసులు జారీచేసింది.సోమవారం సాయం త్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని, లేకుంటే తగిన నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేసింది.సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్‌ నుంచి మునుగోడులోని పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన 23 ఖాతాలకు ఈనెల 14,18,29 తేదీల్లో నగదు బదిలీ చేసినట్టు శనివారం ఆధారాలతో టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి రాజగోపాల్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల ఖాతాల నుంచి ఎంత నగదు బదిలీ అయ్యిందో వెల్లడించి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ డిమాండ్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube