తెలంగాణాలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండోసారి ఏర్పాటు చేసి విపక్షాలకు ఝలక్ ఇచ్చిన కేసీఆర్ మరో సరికొత్త నిర్ణయంతో సంచలనం సృష్టించేందుకు సిద్ధం అవుతున్నారు.ప్రస్తుతం ఢిల్లీలో చెక్కెర్లు కొడుతున్న కేసీఆర్ వరుసగా కీలకమైన వ్యక్తులను కలుస్తూ …కాకరేపుతున్నాడు .ఇప్పటికే… ప్రధాని నరేంద్ర మోదీని.కేంద్ర మంత్రులను కలిసేసాడు.
పనిలో పనిగా… చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ని కలిసేసారు.

తెలంగాణలో లక్షల కొద్దీ ఓట్లు గల్లంతయ్యాయని, తాము ఓడిపోవడానికి అది కూడా ఒక కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు న్యాయపోరాటం మొదలుపెట్టిన క్రమంలో గల్లంతయిన ఓట్ల కారణంగా తమ పార్టీ అభ్యర్థులే నష్టపోయారని, మెజారిటీ తగ్గిందని రివర్స్ ఫిర్యాదు చేశారు కేసీఆర్.అలాగే … టీఆర్ఎస్ సింబల్ ను పోలిన ట్రక్కు, ఐరన్ బాక్స్ లాంటి గుర్తుల కారణంగా తమ ఓట్లు దెబ్బతిన్నాయని కంప్లైన్ట్ చేసేసారు.తమ పార్టీ గుర్తు ‘కారు’ సింబా మరింత స్పష్టంగా….
కనిపించేలా మెరుగులు దిద్ధేందుకు ఈసీ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు కేసీఆర్.అంటే టీఆర్ఎస్ కారు సరికొత్తగా రాబోతుందన్నమాట.