వామ్మో.. ఇలాంటి గుడ్లు తినేముందు జాగ్రత్త సుమీ.!

ప్రస్తుత రోజులలో చాలా మంది వారి ఆరోగ్య విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ఎప్పటికి అప్పుడు డాక్టర్ ను సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటా ఆరోగ్యం బాగా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలో చాలామంది డాక్టర్లు ప్రతిరోజు కూడా గుడ్డు( Egg ) తింటే వారి ఆరోగ్యానికి మంచిదని చెబుతూ ఉంటారు.అంతేకాకుండా, చాలామంది గుడ్డులో అనేక పోషకాలు లభిస్తాయని ఎంతో ఇష్టంగా తింటారు.

ఇక మరికొందరు అయితే పగిలిన గుడ్లను( Cracked Eggs ) కూడా వదలకుండా తినడం మొదలుపెట్టేశారు.కానీ ఇలా పగిలిన గుడ్లు తినడం వల్ల అనేక వ్యాధులు రావడంతో పాటు వారి ఆరోగ్యానికి నష్టం చేకూరుతుందని నిపుణులు తెలియజేస్తూన్నారు.

నివేదికల ప్రకారం పగిలిన గుడ్లల్లో సాల్మొనెల్లా( Salmonella ) అనే ప్రాణాంతక బ్యాక్టీరియా కనిపిస్తుంది.ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా దాని సెల్ ద్వారా గుడ్డులోకి ప్రవేశించి ఆ గుడ్డును తిన్న వ్యక్తికి సోకుతుంది.ఫుడ్ పాయిజన్, కడుపు తిమ్మిరి, వాంతులు, విరోచనాలు, జ్వరం లాంటి అనేక సమస్యలు ఎక్కువగా వస్తాయి.

Advertisement

అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫెక్షన్ సోకిన వారు చిన్న పిల్లలు వృద్దులకు చాలా ప్రాణాంతకరం కూడా కావచ్చు.

వాస్తవానికి గుడ్డుపై పగుళ్లు ఉంటే లోపల భాగం బయటికి కనిపించినట్లే దాన్ని వెంటనే వాడకుండా పక్కకు పడేయడం మంచిది.అంతేకాకుండా గుడ్డు నుంచి ఎటువంటి దుర్వాసన వచ్చినా కానీ.అది పాడైపోయినట్లని, దానిని గుర్తించి వెంటనే ఉపయోగించకుండా పక్కకు పారేయడం మంచిదని డాక్టర్ తెలియజేస్తూన్నారు.

ఇక మనం తినే గుడ్లు మంచిగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు తాజా గుడ్లను కొనుగోలు చేసుకుని బ్యాక్టీరియా పెరగకుండా గుడ్లను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉపయోగించడం మంచిది.

చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష
Advertisement

తాజా వార్తలు