ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది.
సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ”ఆదిపురుష్( Adipurush )”.ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ ( Prabhas )సింగిల్ గా వస్తున్నాడు.
ఇది కూడా ఈయనకు కలిసి వచ్చే అంశం.భారీ విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది.

మరి ఈ ఇతిహాస కథను బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటించింది.ఇక బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించాడు.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో భారీ హైక్ నెలకొంది.

ఈ ఆసక్తిని అలాగే కొనసాగిస్తూ నైజాం లో అదనపు షోస్ సహా హైక్స్ కూడా వచ్చేసాయి.ఇక ఇప్పుడు ఏపీలో కూడా బెనిఫిట్ షో గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.ఏపీలో అనేక ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ఫిక్స్ అయినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోలు ఎక్కడెక్కడ వేస్తారా అని అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.జూన్ 16 తెల్లవారు జాము నుండే స్పెషల్ షోస్ పడిపోనున్నాయని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మొన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఫైనల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.దీంతో మరింత హైప్ పెరిగింది.
ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రివ్యూ షో వీక్షించిన వారి నుండి మంచి స్పందన రాగా మన ఇండియాలో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.







