పోలీస్ శాఖలో అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్థించాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

తొమ్మిది నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న 125 (సివిల్,ఆర్ముడ్ రిజర్వు, కమ్యూనికేషన్ )కానిస్టేబుళ్లకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ.

అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాకు చేరుకున్న నూతన సివిల్ ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ తో సమావేశం నిర్వహించి విధులపై దిశ నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పూర్తి నిబద్దతతో, అంకితభావంతో,క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకారవలన్నారు.

పోలీస్ శాఖ అనుసరిస్తున్న సాంకేతక పరిజ్ఞానం అందిపుచ్చుకోవలన్నారు.శరీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఎలాంటి సవాళ్లనైన ఎదుర్కొని నిలబడవచ్చాన్నారు.

తొమ్మిది నెలల శిక్షణలో నేర్చుకున్న నూతన చట్టాలపై నిరంతరం పటనం చేస్తూ అన్ని చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.ఉన్నత అధికారుల ఆదేశాలను పాటిస్తూ తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని,విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం చూపిన,శాఖ పరమైన చార్యలుంటాయన్నారు.

Advertisement

విజిబుల్ పొలిసింగ్ లో భంగంగా అమలు చేస్తున్న విలేజ్ పోలీసింగ్ లో భాగంగా తమకు కేటాయించిన గ్రామాలపై పట్టు సాధించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉంటూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తిచాలని తెలిపారు.ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది నాకబంది, పికెట్స్,విఐపి బందోబస్త్ డ్యూటీస్,వివిధ బందోబాస్త్ డ్యూటీలలో , ప్రిసనర్,క్యాష్ ఎస్కార్డ్స్,లా అండ్ ఆర్డర్ విధులలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్.ఐ కు రమేష్, మధుకర్, ఆర్.ఎస్.ఐ శ్రవణ్ యాదవ్, కమ్యూనికేషన్ సి.ఐ శ్రీలత ,నూతన కానిస్టేబుల్ పాల్గొన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News