Balakrishna: ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ పది రోజులు భోజనం చేయలేదా.. ఇంతకు అసలు ఏం జరిగిందంటే?

మామూలుగా సినిమా షూటింగ్ సమయంలో కొందరు నటీనటులు ( Actors )చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.

తమ పాత్రల విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉంటారు.

ముఖ్యంగా తమ పాత్రలకు గౌరవం అనేది ఇస్తుంటారు.ఏ పాత్రనైనా కూడా చేయటానికి అసలు మొహమాటం పడరు.

కొన్ని కొన్ని సార్లు హీరోల పాత్రలు రకరకాల లుక్స్ తో ఉంటాయి.తమ ముఖచిత్రం కూడా గుర్తుపట్టనంతగా మేకప్ వేసుకుంటూ ఉంటారు.

ఇక కొన్నిసార్లు తమ మేకప్ తీయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది.అది ఎంత కష్టం ఉన్నా కూడా సినిమా మీద ఉన్న గౌరవంతో తీయటానికి ఇష్టపడరు.

Advertisement

ఎంత సమయం షూటింగ్ ఉంటే అంత సమయం వరకు ఆ కష్టమైన మేకప్ తోనే ఉంటారు.కొన్ని కొన్ని సార్లు తమకున్న మేకప్ వల్ల ఫుడ్ తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే అటువంటిది హీరో బాలకృష్ణ( Balakrishna ) ఎదురుకున్నాడు.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం బాలయ్య వయసు మీద పడినా కూడా ఎనర్జీ మాత్రం పెంచుకుంటూనే పోతున్నాడు.కుర్ర హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తూ అందరిచే శభాష్ అనిపించుకుంటున్నాడు.నిజానికి బాలయ్యకు ఈ వయసులో ఇంత ఎనర్జీ ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

ఆయస పడకుండా డైలాగులు, ఫైటింగులు, డాన్స్ లు ఇలా ఒకటేమిటి ప్రతి విషయంలో బాలయ్య బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.ఇక ఈ మధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా హిట్ అవుతున్నాయి.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఇప్పుడు మరిన్ని హిట్టులు కొట్టడానికి లైన్ లో ఉన్నాడు.ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Advertisement

కూతుర్ల వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ లు చేస్తున్నాడు బాలయ్య.ఇక బాలయ్య సినిమాల విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

బాలయ్యకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ వయసులో కూడా ఈయన సినిమాల పట్ల ఇంత ఎనర్జీగా కనిపిస్తున్నాడు అంటే ఆయనకు సినిమాల మీద ఉన్న పాషన్ అని చెప్పాలి.ఇక బాలయ్య వ్యక్తిగతంగా కంటే సినిమాల విషయంలో చాలా కేరింగ్ గా ఉంటాడు.షూటింగ్ స్పాట్ కు చెప్పిన సమయాన్ని కంటే రెండు గంటలు ముందే వస్తాడు.

అయితే ఓసారి తను ఒక సినిమా సమయంలో ఏకంగా 10 రోజులు భోజనం చేయకుండా ఉన్నాడని తెలిసింది.అదేంటంటే బాలయ్య గతంలో భైరవద్వీపం( Bhairavadweep ) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అందులో బాలయ్య గెటప్ చాలా డిఫరెంట్ గా ఉండేది.అంటే ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో కనిపించాడు.

ఆ పాత్రకు కాస్త కష్టంగా ఉన్న మేకప్ కూడా వేసుకున్నాడు.ఆ మేకప్ వల్ల బాలయ్యకు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేదట.

కేవలం జ్యూసులు మాత్రమే సరిపెట్టుకునే వాడట.అలా పది రోజులకు పైనే భోజనం చేయకుండా జ్యూసులు తాగాడట బాలయ్య.

తాజా వార్తలు