ప్రభాస్ ( Prabhas )కెరీర్ లోనే అత్యంత క్రేజ్ ఉన్న చిత్రం ‘సలార్’( Salaar movie ) కోసం అభిమానులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎంత ఆతృతగా ఎదురు చూసారో మన అందరికీ తెలిసిందే.‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేదు.ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చింది.అందుకే ‘సలార్’ చిత్రం మీద మొత్తం ఆశలన్నీ పెట్టుకున్నారు.అలా భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది.కమర్షియల్ గా ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది అని అందరూ అనుకున్నారు.
మొదటి నుండి ఉన్న కాంబినేషన్ హైప్ కి పాజిటివ్ రివ్యూస్ కూడా తోడు అవ్వడంతో మొదటి మూడు రోజులు వేరే లెవెల్ లో వసూళ్లు వచ్చాయి.ఒక్కమాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ స్టార్ హీరోల హైయెస్ట్ కలెక్షన్స్ మొత్తాన్ని మూడు రోజుల్లోనే దాటేశాడు.

చూడాల్సిన యూత్ ఆడియన్స్ మొత్తం మొదటి మూడు రోజుల్లోనే చూసేసారు.ఇక లాంగ్ రావాలంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఉండాలి.కానీ ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తక్కువ అనే విషయం నిన్న క్రిస్మస్ పండుగ నిరూపించింది.బాలీవుడ్ మార్కెట్, కర్ణాటక, కేరళ తో పాటుగా ఓవర్సీస్ లో కూడా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన ‘డుంకీ’ చిత్రం భారీ లీడ్ తీసుకుంది.
మొదటి 3 రోజలు సలార్ చిత్రం డుంకీ చిత్రం పై భారీ మార్జిన్ తో లీడ్ సాధించింది.కానీ నిన్నటి నుండి మాత్రం డుంకీ లీడ్ లోకి వచ్చేసింది.
ఇక నుండి కూడా వర్కింగ్ డేస్ లో డుంకీ చిత్రం హవానే ఎక్కువగా కనిపించబోతుంది కాబట్టి, రాబోయే రోజుల్లో సలార్ కంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు డుంకీ ( Dunki )కి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇప్పటి వరకు డుంకీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ ఏడాది లో రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి చరిత్ర సృష్టించాడు షారుఖ్ ఖాన్.ఇప్పుడు మూడవ సారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టలేకపోవచ్చు కానీ, ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని మాత్రం కచ్చితంగా రాబడుతాడు అని చెప్పొచ్చు.సలార్ కి హిందీ వెర్షన్ లో ఇప్పటి వరకు 65 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.ఫుల్ రన్ లో సలార్ 150 కోట్ల రూపాయిల వరకు వెళ్లొచ్చని అంటున్నారు.
చూడాలి మరి.