రాంగ్ రూట్ లో వచ్చిన హీరో... వెనక్కి పంపిన పోలీస్

ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి.కేవలం అంబులెన్స్ లకి మాత్రమే ట్రాఫిక్ రూల్స్ ని క్రాస్ చేసే రైట్స్ ఉంది.

అయితే అంబులెన్స్ లు వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక ట్రాక్ ఉంటుంది.అయితే ఈ ట్రాఫిక్ రూల్స్ ని ఎక్కువగా అతిక్రమించే దేశాలలో ఇండియా కచ్చితంగా ఉంటుంది.చాలా దేశాలలో రాత్రి సమయంలో వెహికల్స్ లేకపోయిన వాహనదారులు పెర్ఫెక్ట్ గా రూల్స్ ఫాలో అవుతారు.

లేదంటే అక్కడ పోలీసులు వారి ఇంటికి నోటీసులు పంపిస్తారు.అయితే ఇండియాలో ఉదయం వేళల్లో మాత్రమే అది కూడా తప్పదు కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.

ఇక ఈ రూల్స్ బ్రేక్ చేసేవారిలో సామాన్యుల కంటే సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ముందు వరుసలో ఉంటారు.తమకి ఎలాంటి రూల్స్ ఉండవనే అభిప్రాయంతో వారు ఉంటారు.

అయితే ఒక్కో సందర్భంలో వారికి పోలీసుల నుంచి షాక్ లు తగులుతూ ఉంటాయి.తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ కి అలాంటి అనుభవమే కేరళలో ఎదురైంది.

తన స్పోర్ట్స్ కారులో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసుకొని రాంగ్ రూట్ లో ఈ యంగ్ హీరో వచ్చేశాడు.అయితే అక్కడున్న పోలీస్ అతనికి అడ్డుతగిలి రాంగ్ రూట్ లో వచ్చారని, కరెక్ట్ చేసుకోవాలని చెప్పడంతో మరోమాట మాట్లాడకుండా కొంత దూరం వెనక్కి వెళ్లి రూట్ మార్చి రైట్ రూట్ లోకి వెళ్ళాడు.

అయితే ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.సొసైటీలో ప్రజలకి ఆదర్శంగా ఉండాల్సిన హీరోలే ఇలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి రాంగ్ రూట్ లో వెళ్తూ ఉంటే వారిని ఫాలో అయ్యే అభిమానులు కూడా అలాగే చేస్తారు కదా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు