నేడు ఏపీ లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్

ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంబించాయి.భారత్ లోనూ నేటి నుండి కరోనా డ్రై రన్ మొదలువుతుంది.

డ్రై రన్ అంటే, ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే టీకా పంపిణీకి అధికార యంత్రగానికి అప్రమత్తం చెయ్యడం.ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ విషయంలో ఉన్న అపోహలను పోగొట్టడమే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి ముందుగానే చర్యలు తీసుకోవడం లాంటిది.

అందుకు డమ్మీ వ్యాక్సిన్ ను ఇస్తారు.కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ను దేశంలోని నాలుగు రాష్ట్రలో ప్రారంబిస్తారు.

గుజరాత్, అస్సాం, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్.ప్రతి రాష్ట్రం నుండి రెండు జిల్లాలను ఎంపిక చేస్తారు.

Advertisement

ఒక్కో జిల్లా నుండి 1000 మందికి ఈ డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు.ఇలా వ్యాక్సిన్ ఇచ్చేవారికి ముందుగా ఎస్‌ఎం‌ఎస్ పంపిస్తారు ఆ ఎస్‌ఎం‌ఎస్ లో టీకా ఇచ్చే అధికారి పేరు, సమయం, వ్యాక్సినేషన్ కేంద్రం తదితర వివరాలు ఉంటాయి.

టీకా ఇచ్చిన తర్వాత ఓ అరగంట పాటు అధికారుల పర్యవేక్షణలో ఉండాలి ఏమైనా సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉంటే పర్యవేక్షిస్తారు.సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్రానికి చేరవేస్తారు.

ప్రజల్లో కరోనా వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించడమే డ్రై రన్ ప్రదాన లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు