ఛీ.. వీడు మ‌నిషేనా.. రెండు నెలల ప‌సిపాప చేయి నరికేసిన యువ‌కుడు!

తాగిన మైకంలో కొంద‌రు ఏం చేస్తారో.ఎలా ప్ర‌వ‌రిస్తారో కూడా తెలియ‌దు.

అయితే తాజాగా తప్ప తాగిన మైకంలో ఓ యువ‌కుడు ఏం చేస్తున్నానో కూడా తెలియ‌కుండా.

రెండు నెల‌ల ప‌సి పాప‌ చేయి న‌రికేశాడు.

ఈ దారుణ ఘ‌ట‌న ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది.ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా పైకపడ గ్రామంలో పంకజ్‌ అనే వ్యక్తి భార్యా, పిల్ల‌ల‌తో నివాసం ఉంటున్నారు.

Advertisement

వారి ఇంటి ప‌క్క‌న గ‌ణేష్ అనే యువ‌కుడు ఉంటున్నాడు.అయితే మంగళవారం సాయంత్రం పంకజ్ ఇంటి వరండాలో త‌న రెండు నెలల కుమార్తెతో కలిసి కుర్చీలో కూర్చున్నాడు.

ఇంత‌లోనే పక్కింట్లో ఉండే గణేష్ త‌ప్ప తాగి వ‌చ్చి.పంకజ్‌తో అకారణంగా గొడవ పెట్టుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే ఇద్ద‌ర మ‌ధ్య మాటామాటా పెరిగింది.దీంతో తాగున్న గ‌ణేష్ ఆగ్ర‌హానికి గురై.

ఇంట్లో నుంచి కత్తి తెచ్చి పంకజ్‌తో పాటు పసిపాపపై దాడి చేయ‌సాగాడు.ఈ దాడి‌లో పంకజ్ చేతికి తీవ్ర గాయం కాగా చిన్నారి చేయి శరీరం నుంచి తెగిప‌డింది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
రాముడిలా కనిపించేవాళ్లు రావణుడిలా కనిపించకూడదు.. ముఖేష్ కన్నా కామెంట్స్ వైరల్!

ఇది గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే బాధితుల‌ను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.ప్ర‌స్తుతం చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో.

Advertisement

మెరుగైన వైద్యం కోసం కటక్ కేంద్ర ఆస్పత్రికి త‌ర‌లించారు.మ‌రోవైపు బాధితుల కుటుంబ‌స‌భ్యులు గ‌ణేష్‌పై ఫిర్యాదు చేయ‌గా.

పోలీసులు నింధితుడిపై కేసు న‌మోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

తాజా వార్తలు