డ్రగ్స్ కేసు - పోలీసు ముట్టుకున్నాడంటూ ఛార్మీ కంప్లయింట్

టాలివుడ్ డ్రగ్స్ కేసులో సస్పెక్ట్స్ లో ఒకరైన హీరోయిన్ ఛార్మీని ప్రస్తుతం విచారిస్తున్నారు సిట్ అధికారులు.

ఆవిడ ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్, నాంపల్లిలోని అబ్కార్ ఆఫీసుకి ఆరుగురు బౌన్సర్లతో సహా చేరుకుంది.

అయితే లోనికి తీసుకెళ్ళే ప్రయత్నంలో తనని ఒక మగ పోలీసు తాకాడని, తప్పుగా ప్రవర్తించాడని ఛార్మీ సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ కి కంప్లయింట్ చేసింది.శ్రీనివాస్ అనబడే ఆ కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఛార్మీ విచారణ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.ఆ తరువాత ఆమెని ప్రశ్నించలేరు అధికారులు.

అయితే ఈరోజు గనుక రాబట్టవలసిన సమాచారం మొత్తం రాలేదని భావిస్తే, ఛార్మీని మరోసారి విచారణకి పిలిపించవచ్చు.ఛార్మీ కోరిక మేరకు ఆమెను నలుగురు మహిళా అధికారులే విచారిస్తున్నారు.

Advertisement

డ్రగ్ డీలర్ కెల్విన్ మొబైల్ లో ఛార్మీకి కాల్స్ ఉండటమే కాదు, అతడితో ఛార్మీ వాట్సాప్ లో వేలకొద్ది మెసేజ్ లతో చాట్ చేసినట్లు తెలుస్తోంది.ఆ అంశం మీద ఛార్మీని ప్రశ్నలు అడుగుతున్నట్లు టాక్.

అయితే కెల్విన్ మొబైల్ లో ఛార్మీ నంబర్ తన సొంత పేరుతో కాకుండా, దాదా అనే పేరుతో ఉండటం విశేషం.ఛార్మీ నుంచి ఎలాంటి బ్లడ్ సంపిల్స్ తీసుకునేలా లేరు అధికారులు.

తన అనుమతి లేకుండా బ్లడ్ సంపిల్స్ తీసుకోరాదని కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.ఆలాగే తనకి విచారణ సమయంలో తన సొంత లాయర్ కావాలని, అతడి సమక్షంలోనే విచారణ జరగాలని ఛార్మీ కోరినా, ఆ డిమాండ్ ని తిరస్కరించింది కోర్టు.

ప్రస్తుతం ఛార్మీ మాత్రమే విచారణలో కూర్చుంది.ఈ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు రేపు ఇక్కడే చూడొచ్చు.

వైరల్: గజదొంగలు సైతం ఆ తాళాన్ని తీయలేరు... తాళం ఎలా వేశారో చూడండి!
Advertisement

తాజా వార్తలు