ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది మద్యం తాగి చిందులేశారు.హనుమకొండలోని జీఎంహెచ్ లొ ఆరోగ్యశ్రీ విభాగంలో సేవలందిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు, బయటివారితో కలిసి పుట్టినరోజు పార్టీ ఆసుపత్రిలోనే చేసుకొన్నారు.
బీర్లు తాగి డ్యాన్స్‌లు చేశారు.వీరిని దవాఖానకు వచ్చిన వారి బంధువులు వీడియో తీశారు.
వారంరోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.







