ఇటీవల కాలంలో ఇతర భాషా చిత్రాలను తెలుగులో ఎక్కువగా రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలతో పాటు దర్శకనిర్మాతలు ఇష్టపడుతున్నారు.ఈ క్రమంలో మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన చిత్రాలను తెలుగులో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు.
ఈ జాబితాలో దృశ్యం-2, లూసిఫర్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల్లో ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి.ఇక ఈ సినిమాలతో పాటు పలు సినిమాల రీమేక్ రైట్స్‌ను ఇక్కడివారు భారీ రేటుకు సొంతం చేసుకున్నారు.
ఈ జాబితాలో మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ ఒకటి.ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో కలిసి రీమేక్ చేయాలని చరణ్ భావించాడు.కానీ ఈ సినిమా కథ చిరంజీవి ఇమేజ్‌కు సెట్ కాదని ఆయన ఫీలవుతున్నాడు.
దీంతో ఈ సినిమా మెగా కాంపౌండ్‌లోని హీరోలతో కాకుండా ఇతర హీరోలతో చేయాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్‌ను మాస్ రాజా రవితేజతో చేయాలని చరణ్ భావిస్తున్నాడట.
అయితే ప్రస్తుతం మాస్ రాజా చేతినిండా సినిమాలు ఉండటంతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు.మరి చరణ్ కోరికమేరకు ఈ సినిమాలో రవితేజ నటిస్తాడా లేడా అనే సందేహం అందరిలో నెలకొంది.
ఇక డ్రైవింగ్ లైసెన్స్ కామెడీ డ్రామాగా మలయాళ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.దీంతో ఈ సినిమా తెలుగు రీమేక్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుంటుందో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ సినిమాను చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూ్స్ చేసేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ సినిమాలో ఎవరు నటిస్తారా, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ప్రశ్నలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.మరి తెలుగులో డ్రైవింగ్ లైసెన్స్‌లో ఎవరు నటిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ క్రిటిక్స్.