DRDO అద్భుత ఆవిష్కరణ... ప్లాస్టిక్ బాటిల్స్ కి బదులుగా బయో పెట్ బాటిల్స్!

నేడు ప్లాస్టిక్‌ వాడకం అనేది ఎంత ప్రాణాంతకంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు.ప్లాస్టిక్ వల్ల వాతావరణం మొత్తం ఏరకంగా కాలుష్యమైపోతుందో అందరికీ తెలిసిందే.

 Drdo Launches Bio Degradable Plastic Products-TeluguStop.com

ఈ క్రమంలో జూలై ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ బ్యాన్ ప్రారంభమైంది.చిన్నచిన్న ఇయర్‌ బడ్స్ నుంచి చేతి సంచుల వరకూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లో ఉన్నాయి.

అందుకనే నిన్నటినుండి వాటిని బ్యాన్ చేశారు.అయితే వీటికి ప్రత్యామ్నాయం ఏంటి? అన్న కోణంలోనుండి DRDO కొత్త ఆవిష్కరణ ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కు బదులు బయో ప్లాస్టిక్ కు రూపకల్పన జరిగింది.

DRDO (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వీరబ్రహ్మం ఏడాదిపాటు పరిశోధన చేసి, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోప్లాస్టిక్ ను రూపొందించారు.

మొక్కజొన్నతో ఈ బయో ప్లాస్టిక్ ను రూపిందించడం జరిగింది.ఈ బయో ప్లాస్టిక్ తో ముందుగా చేతి సంచులను తయారు చేశారు.ఒక ట్రయల్ బేస్ గా తిరుమల తిరుపతిలో బయో ప్లాస్టిక్ సంచుల వినియోగం ప్రారంభించామని, ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయంటున్నారు.మొక్కజొన్నతో తయారుచేసిన ఈ బయో ప్లాస్టిక్ వల్ల ఎలాంటి హానీ లేదని నెల రోజుల్లో భూమిలో, నీటిలో ఇది ఎరువుగా మారిపోతుందంటున్నారు.

Telugu Biodegradable, Bio Pet Bottles, Bio Pet Plastic, Drdo, Plastic, Latest-La

ఇకపోతే, వీటిని తయారు చేయడానికి ప్రత్యేకంగా యంత్రాలు తయారుచేయాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ప్లాస్టిక్ సంచులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీలోనే చిన్న చిన్న మార్పులతో బయో ప్లాస్టిక్ ఉత్పత్తి జరిగిపోతుందని అంటున్నారు.దీనికోసం ఇప్పటికే.20కి పైగా కంపెనీలు ముందుకు వచ్చాయని, వీటికి ఈ టెక్నాలజీని ఉచితంగా DRDO అందిస్తోందంటున్నారు.సింగల్ యూసేజ్ ప్లాస్టిక్ లో అతిపెద్ద ఉత్పత్తి క్యారీ బ్యాగ్స్ లోనే జరుగుతోందని, అందుకే వీటిపై దృష్టిపెట్టామంటున్నారు డీఆర్‌డీవో శాస్త్రవేత్త వీరబ్రహ్మం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube