ఖమ్మంలో మెడికో బలవన్మరణంపై అనుమానాలు..!

Doubts On The Death Of A Medico In Khammam..!

ఖమ్మం జిల్లాలో మెడికో ఆత్మహత్య ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మెడికో మానస ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది.

 Doubts On The Death Of A Medico In Khammam..!-TeluguStop.com

కాలేజీ సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్టల్ లో మానస పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుందని తెలుస్తోంది.తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

అప్పటికే మానస చనిపోయినట్లుగా గుర్తించారు.మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం హన్మకొండకు తరలించారు.

వరంగల్ లోని పోచమ్మమైదానంలో నివాసం ఉంటున్న మృతురాలు తల్లి చిన్నతనంలోనే చనిపోగా తండ్రి పదేళ్ల క్రితం మరణించాడని తెలుస్తోంది.అయితే మానస ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

థర్డ్ ఇయర్ లో సబ్జెక్టులు మిగిలిపోవడంతో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని స్నేహితులు భావిస్తున్నారు.మరోవైపు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ జరపకుండానే అధికారులు మృతదేహాన్ని హుటాహుటిన మార్చురీకి పంపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Doubts On The Death Of A Medico In Khammam! - Telugu Bds, Doubts, Khammam, Medico, Private Hostel #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube